అమెజాన్ నుంచి అమేజింగ్ ట్యాబ్
ప్రఖ్యాత అమెజాన్ కంపెనీ.. టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది. అత్యాధునిక ఫీచర్లతో ‘అమెజాన్ అలెక్సా ట్యాబ్లెట్' శ్రేణిని అధికారికంగా విడుదల చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ‘అలెక్సా+’ సేవలు.. ఇన్‌బిల్ట్‌గా వస్తున్న తొలి ట్యాబ్లెట్లు ఇవేనని అమెజాన్ చెబుతున్నది.
ప్రఖ్యాత అమెజాన్ కంపెనీ.. టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరతీసింది. అత్యాధునిక ఫీచర్లతో ‘అమెజాన్ అలెక్సా ట్యాబ్లెట్’ శ్రేణిని అధికారికంగా విడుదల చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ‘అలెక్సా+’ సేవలు.. ఇన్‌బిల్ట్‌గా వస్తున్న తొలి ట్యాబ్లెట్లు ఇవేనని అమెజాన్ చెబుతున్నది. సాధారణ రీడింగ్, ఎంటర్టైన్మెంట్ పరికరాలుగానే కాకుండా.. గూగుల్, ఆపిల్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులతో అమెజాన్ అలెక్సా ట్యాబ్లెట్ 12 ప్రో, అమెజాన్ అలెక్సా ట్యాబ్లెట్ 11, అమెజాన్ అలెక్సా ట్యాబ్లెట్ 8ను రూపొందించింది.
వీటిలోని అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత.. అలెక్సా+ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ‘అలెక్సా’ అని పిలిచినా, స్క్రీన్‌పై ఉన్న ‘ఆస్క్ అలెక్సా’ బటన్‌ను ట్యాప్ చేసినా.. ఇది వెంటనే యాక్సెస్ అవుతుంది. ఇది వాయిస్ కమాండ్లకు సమాధానం ఇవ్వడమే కాకుండా, ట్యాబ్‌లో చూస్తున్న కంటెంట్‌ను అర్థం చేసుకుని దానికి తగిన సహాయాన్ని అందిస్తుంది. ఇక స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం, షెడ్యూల్స్ నిర్వహించడంతోపాటు వ్యక్తిగత పనుల్లోనూ సాయం అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ మూడు మోడల్స్ ఫీచర్ల విషయానికి వస్తే.. అమెజాన్ అలెక్సా ట్యాబ్లెట్ 12 ప్రో: వీటిలో ప్రీమియం మాడల్ ఇదే. సింగిల్ అల్యూమినియం బాడీతో 6.5 మి.మీ మందంతో అత్యంత సన్నగా, ఆకర్షణీయంగా ఉంటుంది. 12 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ మోడల్లో సాధారణ డిస్‌ప్లేతోపాటు, యాంటీ గ్లేర్ స్పష్టతను అందించే నాన్-మ్యాట్ డిస్ప్లే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అత్యుత్తమ పనితీరు కోసం ఇందులో శక్తిమంతమైన 4ఎన్ఎం ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తోపాటు 16జీబీ ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది. మునుపటి అమెజాన్ ట్యాబ్లెట్ల కంటే మూడు రెట్లు వేగవంతమైన ప్రాసెసింగ్, 9 రెట్లు మెరుగైన గ్రాఫిక్స్ పనితీరును చూపిస్తుంది.
క్వాడ్ డాల్బీ అట్మాస్ స్పీకర్లు, వైఫై 6ఈ కనెక్టివిటీ లాంటి ఇతర ఫీచర్లూ ఉన్నాయి. ఈ డివైజ్‌ను ఒకసారి చార్జ్ చేస్తే.. 16 గంటలపాటు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. దీనితో పాటు ప్రత్యేకంగా ప్రో పెన్, ప్రో కీబోర్డ్ కూడా లభిస్తాయి. పెన్ ద్వారా నోట్స్ రాసుకోవడం, స్కెచ్‌లు గీయడం వంటి పనులు సులభం అవుతాయి. అమెజాన్ అలెక్సా ట్యాబ్లెట్ 11: వినోదం, గేమింగ్, స్ట్రీమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ మాడల్‌ను రూపొందించారు. ఇందులో 11 అంగుళాల 2.5కె డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, డ్యూయల్ డాల్బీ అట్మాస్ స్పీకర్లతోపాటు 15 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
అమెజాన్ అలెక్సా ట్యాబ్లెట్ 8: ప్రయాణాల్లో వాడటానికి, ఈ-రీడర్లా ఉపయోగించడానికి ఈ మాడల్ అనుకూలంగా ఉంటుంది. ఇందులో 8.7 అంగుళాల డిస్ప్లేతో కేవలం 329 గ్రా. బరువుతో ఒక చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరు చూపించే ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. వైఫై 6 సపోర్ట్, 14 గంటల వీడియో బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా ‘అమెజాన్ కిడ్స్ ట్యాబ్లెట్స్’ కూడా విడుదల చేశారు. 8.7 అంగుళాలు, 11 అంగుళాల పరిమాణాలలో ఈ అమెజాన్ కిడ్స్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. పిల్లలు తమ సొంత గొంతుతో ఒరిజినల్ ఇలస్ట్రేటెడ్ కథలను సృష్టించుకునేలా ‘స్టోరీబిల్డర్’ అనే ఫీచర్‌ను చేర్చారు. అత్యాధునిక ఏఐ ఫీచర్లతో తయారైన ఈ ట్యాబ్లెట్లు త్వరలోనే భారతీయ మార్కెట్లో విడుదల కానున్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

