రోజులో కాస్త ఫ్రీ టైమ్ దొరికినా, వీకెండ్ వచ్చినా.. ఓటీటీకి అంకితం అవుతున్నాం. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అమెజాన్ ప్రైమ్ ముందువరుసలో ఉంటున్నది. మీ ప్రైమ్ ఖాతా ఎంతవరకు భద్రంగా ఉందన్నది ప్రధానం. ఇంట్లో పిల్లలు ఉంటే.. ఫోన్ అందుకొని ప్రైమ్‌లోకి చొరబడటం కామన్! రెంట్ పేరుతో కనిపించే సినిమాలనూ కొనేస్తున్నారు!! ఇలా అనవసరమైన కంటెంట్‌ను చూడకుండా నియంత్రించడానికి పిన్ సెట్ చేయడం అవసరం. మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో అమెజాన్ ప్రైమ్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి పిన్ సెట్ చేసుకోవచ్చు.
ఇందుకోసం యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేయండి. అక్కడ ‘సెట్టింగ్స్’ ట్యాప్ చేయండి. అక్కడ ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే.. వ్యూయింగ్ రిస్ట్రిక్షన్స్, పర్చేస్ రిస్ట్రిక్షన్స్, చేంజ్ ప్రైమ్ వీడియో పిన్ లాంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేయడం ద్వారా మీ ప్రైమ్ ఖాతాను సురక్షితంగా వాడుకోవచ్చు. ఇది మీ ఫ్యామిలీకి పేరెంటల్ కంట్రోల్లా ఉపయోగపడుతుంది. ఈ సెట్టింగ్స్ మార్చడం వల్ల పిల్లలు అనవసరమైన కంటెంట్ చూడకుండా నియంత్రించవచ్చు!