బొమ్మలు చేసి.. ప్రాణం పోసి!

క్లే ఆర్ట్.. మట్టితో బొమ్మలకు ప్రాణం పోసే వినూత్న సృజన. పర్యావరణ హితమైన ఈ కళలో పట్టున్న అతికొద్దిమందిలో హైదరాబాద్‌కు చెందిన సంగిశెట్టి సంగీత ఒకరు. క్లే ఆర్ట్ చిత్రకారిణిగా సంగీత ప్రతిభకు మెచ్చి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ తమ రికార్డు పుస్తకాల్లో ఆమెకో పేజీని కేటాయించాయి.
చిన్నప్పుడు మట్టితో ఆడుకుంటాం. మట్టి ముద్దలతో వినాయక విగ్రహాలు, బండి చక్రాలు చేసి మురిసిపోతాం. పెద్దయ్యాక మట్టి జోలికే వెళ్లం. కానీ, హైదరాబాద్‌కు చెందిన సంగిశెట్టి సంగీత చిన్ననాటి జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకొని.. ‘క్లే ఆర్ట్’ మీద పట్టు సాధించారు. మట్టిబొమ్మలకు ప్రాణం పోస్తున్నారు. క్లే ఆర్ట్‌లో అచ్చంగా పూలను పోలిన క్యారికేచర్ తరహా బొమ్మలు, వస్తువులు తయారు చేయవచ్చు. పెండ్లయిన తర్వాతే, సంగీత క్లే ఆర్ట్‌లో ప్రావీణ్యం సంపాదించారు. తన కాన్సెప్ట్‌కు తగ్గట్లుగా ఎటువంటి రికార్డూ లేకపోవడంతో 74 పని గంటల్లో.. పిస్తా పొట్టుపై మైక్రో క్లే ఆర్ట్ రూపంలో 154 కూరగాయలు, ఆహార పదార్థాలు, స్వీట్స్ బొమ్మలకు రూపం ఇచ్చారు. పిస్తా పొట్టు చాలా చిన్నగా ఉంటుంది. దానిపై మట్టి బొమ్మలు అంటే నేర్పు, ఓర్పు అవసరం. ఎంతో ఒత్తిడి ఎదురైనా, లెక్కచేయకుండా అనుకున్నది సాధించారు సంగీత. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ సరికొత్త రికార్డును సంగీత పేరిట నమోదు చేశాయి. క్లే క్రాఫ్ట్స్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆన్లైన్ వేదికగానూ తన బొమ్మలను విక్రయిస్తున్నారు సంగీత. వీటిని గృహాలంకరణకు ఉపయోగించుకోవచ్చు. పెండ్లిళ్లు, పుట్టినరోజులకు బహుమతిగానూ ఇవ్వవచ్చు. గృహిణులకు, విద్యార్థులకు శిక్షణ కూడా ఇస్తున్నారు సంగీత (9177334491).
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

