షుగర్ కారణంగా చాలామంది రాత్రిపూట భోజనం మానేశారు. చపాతీ, రోటీ, పుల్కా… ఇలా పేరు ఏదైనా రాత్రి భోజనం కోసం రొట్టెల మీదే ఆధారపడుతున్నారు. కాస్త పీచులు ఎక్కువగా ఉన్నా ఇది కూడా కార్బొహైడ్రేట్లు కలిగిన పదార్థమే. దీనికి ప్రొటీన్ కలప గలిగితే బలవర్ధకమైన ఆహారంగా మార్చుకోవచ్చు. అందుకు కొన్ని దారులున్నాయి.