Meena | 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. బుల్లితెర ప్రేక్షకులనూ అలరిస్తున్న వెండితెర వెలుగుల రాణి మీనా
బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మీనా అనగానే మనకు ‘సీతారామయ్యగారి మనవరాలు’ గుర్తొస్తుంది. ‘అల్లరిపిల్ల’ అనిపిస్తుంది. ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’లో గడసరి సొగసరి కండ్లముందు కదలాడుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ.. ఇలా దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలతో నటించి సూపర్ హీరోయిన్ అనిపించుకున్నది.
బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మీనా అనగానే మనకు ‘సీతారామయ్యగారి మనవరాలు’ గుర్తొస్తుంది. ‘అల్లరిపిల్ల’ అనిపిస్తుంది. ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’లో గడసరి సొగసరి కండ్లముందు కదలాడుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ.. ఇలా దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలతో నటించి సూపర్ హీరోయిన్ అనిపించుకున్నది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన నటనా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ వెండితెర వెలుగుల రాణి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులనూ అలరిస్తున్నది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘సెలబ్రిటీ డ్యాన్స్ సూపర్ జడ్జిగా వ్యవహరిస్తున్నది మీనా. ఈ సందర్భంగా ఆమె ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలివి..
Meena | నటిగా నా ప్రయాణం ఎప్పుడూ ఆనందంగానే సాగింది. బాలనటిగా అద్భుతమైన పాత్రలు పోషించాను. హీరోయిన్గా అందరు సూపర్స్టార్లతో నటించాను. వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు పరిశ్రమకు దూరమైనా ఏదో ఒకరకంగా అభిమానులకు దగ్గరగానే ఉన్నాను. ఒక నటిగా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నాను. ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నాను. దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. వెండితెరపైనే కాకుండా టెలివిజన్ కూడా ప్రేక్షకులను పలకరించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.
డ్యాన్సర్లు కాకపోయినా..
నటిగానే కాకుండా వ్యక్తిగతంగానూ నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొనడం నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఇలాంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఇతర షోల కంటే ‘సూపర్ జోడీ’ భిన్నమైనది. పోటీదారుల అంకితభావం, కష్టపడే తత్వం చూడముచ్చటగా అనిపిస్తున్నది. ఈ కంటెస్టెంట్లు ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కాకపోయినా చాలా కష్టపడుతున్నారు. న్యాయనిర్ణేతగా లోటుపాట్లు చెప్పడం నా బాధ్యత. కానీ, కొన్నిసార్లు తప్పొప్పులు చెప్పడానికి సంకోచించాల్సి వస్తుంది. ఏదైనా కామెంట్ వాళ్లను బాధపెడుతుందేమో అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటాను. ఏదేమైనా… న్యాయనిర్ణేతగా నేను కరెక్ట్‌గా ఉండాలి. నా జడ్జ్మెంట్ను వాళ్లు సానుకూలంగా స్వీకరిస్తుండటం సంతోషంగా ఉంది.
జ్ఞాపకాల్లోకి..
ఈ షో ద్వారా నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. స్టేజ్ మీద నా పాటకు ప్రదర్శన ఇచ్చినప్పుడు, నోస్టాలజీ అనుభూతి కలుగుతుంది. ఆ పాట షూటింగ్ సంగతులు, ఆ సినిమా ముచ్చట్లు మదిలో కదలాడుతాయి. ఇక ఈ షో షూటింగ్ అంటారా చాలా సరదాగా సాగిపోతుంది. ఒకప్పటికీ ఇప్పటికీ డ్యాన్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. గతంలో డ్యాన్స్ అంటే చాలా సింపుల్ మూమెంట్స్ ఉండేవి. రియాలిటీ షోలు డ్యాన్స్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి. సెట్, కాస్ట్యూమ్స్ ఇలా ప్రతి విషయంలోనూ పర్ఫెక్షనిజం కనిపిస్తున్నది. ఈ కళలో కొత్తకోణాన్ని ప్రత్యక్షంగా చూడటం అద్భుతంగా ఉంది. ఎలిమినేషన్ జరిగిన ప్రతిసారీ చాలా బాధపడతాను. కానీ, ట్రోఫీని ఒక్కరే దక్కించుకోగలరు కదా!
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి నలభై సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను గౌరవించడం చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. నేను పోషించిన పాత్రల చిత్రాలతో అలంకరించిన చీర బహుమతిగా ఇచ్చి జీ తెలుగు బృందం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల ప్రేమ, ఆదరణకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
– హరిణి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

