స్నానానికి సంకోచమా!
ఎండకాలంలో ఇట్టే చెమట పట్టేస్తుంది. అందుకే, వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, చిన్నపిల్లలు ఎప్పట్లాగే స్నానం వద్దని మారాం చేస్తుంటారు. కానీ, కొందరు పెద్దవాళ్లు కూడా స్నానం అంటేనే బద్ధకిస్తుంటారు.
ఎండకాలంలో ఇట్టే చెమట పట్టేస్తుంది. అందుకే, వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే, చిన్నపిల్లలు ఎప్పట్లాగే స్నానం వద్దని మారాం చేస్తుంటారు. కానీ, కొందరు పెద్దవాళ్లు కూడా స్నానం అంటేనే బద్ధకిస్తుంటారు. మరికొందరు భయపడుతుంటారు కూడా. ఇలా స్నానం చేయడానికి ఇష్టపడకపోవడం, భయపడటమే.. ‘అబ్లుటోఫోబియా’. స్నానం మాత్రమేకాదు.. ముఖం కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం పట్ల కూడా వీళ్లకు విపరీతమైన, అకారణమైన భయం ఉంటుంది.
ఈ అబ్లుటోఫోబియా బాధితులకు స్నానం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, నీటిని చూసినప్పుడు తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. ఆ సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే సాధారణ ఫోబియాలు వ్యక్తిగత జీవితంపైనే ప్రభావం చూపుతాయి. కానీ, అబ్లుటోఫోబియా సామాజికంగానూ ఇబ్బంది పెడుతుంది.
ఎక్కువ రోజులు స్నానం చేయకుండా ఉండటం వల్ల శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. చర్మ సమస్యలు చుట్టుముడతాయి. దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే, ఇలాంటి పిల్లల్లో స్నానం చేయడాన్ని ఓ సరదా కార్యక్రమంగా మార్చాలని చెబుతున్నారు నిపుణులు.
మొదట్లో తడి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకోవడం లాంటివి అలవాటు చేయాలి. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా స్నానం చేసే వరకూ తీసుకురావాలి. ఈ భయం పెద్దయ్యాక కూడా కొనసాగితే.. ఫోబియాను అధిగమించడానికి థెరపిస్ట్ సలహాలు తీసుకోవాలి. స్నానం పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలను మార్చడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ లాంటివి సమర్థంగా ఉపయోగపడతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

