ఆదివారం 29 నవంబర్ 2020
Zindagi - Apr 23, 2020 , 22:24:09

ఆన్‌లైన్‌లో కథలు

ఆన్‌లైన్‌లో కథలు

  • లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందా అని అంతా 

ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో పిల్లలను ఇంట్లోనే పట్టి ఉంచడం తల్లిదండ్రులకు చాలా కష్టమవుతున్నది. కాబట్టే, పిల్లలను ఏదో ఒక రూపంలో బిజీగా ఉంచడానికి శోభా థరూర్‌ శ్రీనివాసన్‌ ఆన్‌లైన్‌లో అనేక కథలు చెబుతున్నది. ఈమె కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌కి స్వయానా అక్క. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నది. ఇండియాలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న మనవళ్లు, మనవరాళ్లను మిస్‌ అవుతున్న లోటును తీర్చుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నది. పిల్లల కోసం పంచతంత్ర కథలు, తెనాలి రామకృష్ణ కథలు చెప్పేందుకు సిద్ధమైనది. యూట్యూబ్‌ ద్వారా ఈ కథలను వినిపిస్తున్నది. రేడియోలో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ పని మరింత సులువైంది. మరీ సాగదీసినట్టు కాకుండా 400 పదాలతో ముక్తాయించేలా కథల్ని రాసుకుంటుందట శోభ. ఇది కాకుండా మరో 20 కథలకు వాయిస్‌ ఇచ్చింది. ఈ కథలను ప్రముఖ క్లాసికల్‌ డ్యాన్సర్‌ రాజశ్రీ వారియర్‌ తన నృత్యం ద్వారా కూడా చెప్పబోతున్నారు.