ఆదివారం 29 మార్చి 2020
Zindagi - Mar 14, 2020 , 22:16:08

నేను చేశాను మీరూ చేయండి

నేను చేశాను మీరూ చేయండి

టాలీవుడ్‌ నాయికలు నటనతోపాటు అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలతో తమ గొప్ప మనసు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వరుసలోకి రాశీ ఖన్నా కూడా వచ్చి చేరింది. ఆమె కూడా ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో భాగం అవుతూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఓ ప్రైవేట్‌ కంటి హాస్పిటల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా మరో మంచి పని చేసింది. నేత్రదానం ప్రాధాన్యం అందరికీ తెలియజేసే విధంగా తాను కూడా కూడా నేత్రదానం చేయడానికి ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ‘నేను నా కళ్ళు దానం చేశాను, మరి మీరు కూడా చేస్తారా?’ అంటూ అవగాహన పెంచే విధంగా పోస్ట్‌ పెట్టింది. దీనిపై నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తూ కామెంట్స్‌ పెట్టారు. ‘మీలాంటి వారు ఇలా ముందుకొచ్చి నేత్రదానంపై అవగాహన పెంచితే చాలా మంది ప్రజలు కూడా నేత్రదానం చేయడానికి ముందుకొస్తారు’ అంటూ కామెంట్లు పెట్టారు. 


logo