నీటి పొదుపులో నిత్య నూతన ఆవిష్కరణ!
నీటి విలువేమిటో తెలిసిందే. ఎల్‌నినో సందర్భంలో తెలియని వాళ్లకు తెలిసొస్తున్నది. నీటి కరువు అనుభవమవుతున్న సందర్భంలో నీటి పొదుపు కోసం అందరూ ఆలోచిస్తున్నట్టే నిత్య తమ్మన కూడా ఆలోచించింది.
నీటి విలువేమిటో తెలిసిందే. ఎల్‌నినో సందర్భంలో తెలియని వాళ్లకు తెలిసొస్తున్నది. నీటి కరువు అనుభవమవుతున్న సందర్భంలో నీటి పొదుపు కోసం అందరూ ఆలోచిస్తున్నట్టే నిత్య తమ్మన కూడా ఆలోచించింది. నీటి పొదుపు కోసం, నీటి పునర్వినియోగం కోసం ఆవిష్కరణలు చేస్తున్నది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న పదకొండేండ్ల నిత్య ఆలోచనలు, ఆచరణను ‘యాక్షన్ ఫర్ నేచర్’ జర్నల్ ప్రచురించింది. నిత్య వాళ్లింట్లో వేడి నీళ్లు వచ్చేదాకా షవర్ నుంచి నీళ్లు వృథాగా పోతుండేవి.
తాగడానికి ఉపయోగించే నీళ్లు డ్రైనేజీలో కలిసేవి. ప్రతి నీటి బొట్టు విలువైనదేనని తెలిసినా ఎన్నో నీళ్లు రోజూ వృథా అవుతున్నాయని ఆమె బాధపడింది. దీనికి పరిష్కారంగా హాట్ వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకోవాలని తనకు ఓ ఆలోచన తట్టింది. దానికి తగ్గట్టుగా ట్యాప్ తిప్పగానే వచ్చే చన్నీళ్లను తిరిగి పైకి పంపేలా ఏర్పాటు చేసింది. అంతటితో ఆగలేదు. కట్టబోయే ప్రతి ఇంటిలో హాట్ వాటర్ సర్యులేషన్ సిస్టమ్‌ని ఏర్పాటు చేస్తేనే నిర్మాణ అనుమతులు ఉండేలా చట్టం చేయాలని అమెరికాలోని 50 రాష్ర్టాల గవర్నర్లకు లేఖలు రాసింది. ఆ చట్టం వస్తుందో, రాదో తర్వాత… ఒక బాలిక నీటి పొదుపు పట్ల శ్రద్ధ తీసుకోవడం అమెరికన్లను ఆలోచింపజేసింది.
నీటి పొదుపుని ఆచరిస్తూనే ఇదే బాటలో సమాజాన్ని నడిపించాలనుకుంటున్నది నిత్య. తనలాంటి 450 మంది బాలబాలికలతో కలిసి ‘వాటర్ వారియర్స్’ అనే నెట్వర్క్ని నిర్వహిస్తున్నది. వీరంతా పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వంద క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. సమాజంలో మార్పు తేవడానికి చాలాకాలం పడుతుంది. తక్షణం నీటి వృథాని కాపాడేందుకు రెస్టారెంట్లు మంచినీళ్లను గ్లాసులో సగమే నింపి ఇవ్వాలనే ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఇందువల్ల నీటి వృథా తగ్గింది. ప్రజల నుంచి సానుకూల స్పందనే కాదు వాటర్ వారియర్స్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. తను చదివే పాఠశాలలో మంచినీటి వృథాను అరికట్టేందుకు మోస్ ఫిల్టర్‌ని రూపొందించింది. ఇది నీటిని 95 శాతం శుద్ధి చేస్తుందని యాక్షన్ ఫర్ నేచర్ జర్నల్ ప్రచురించింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

