అమ్మపాలు అమృతం లాంటివి. వాటిలోని యాంటీబాడీలు పిల్లలు అనారోగ్యంపాలు కాకుండా కాపాడుతాయి. మొదటి ఆరునెలలూ బిడ్డకు కావాల్సినంత శక్తిని, పోషకాలను అందిస్తాయి. రెండేండ్ల వరకు బిడ్డకు తల్లిపాలు పడితే, వాళ్ల ఎదుగుదల మరింత బాగుంటుంది. మిగిలినవారితో పోలిస్తే, తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువే. ఊబకాయం ఆమడదూరం పారిపోతుంది. అలా, భవిష్యత్లో మధుమేహం వచ్చే ఆస్కారమూ తక్కువే. బిడ్డకు పాలు పట్టిన తల్లులు.. దాదాపుగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారినపడరని అధ్యయనాలు చెబుతున్నాయి.
తల్లిపాలలో పోషకాలు
ఒక్క విటమిన్-డి తప్ప మొదటి ఆరునెలల్లో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలన్నీ తల్లిపాలలో ఉంటాయి. రొమ్ము పాలనుంచి 87 శాతం నీళ్లు, 3.8 శాతం కొవ్వు, ఒక శాతం ప్రొటీన్, 7 శాతం కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. 100 మిల్లీ లీటర్ల తల్లి పాలలో 60-75 కిలో క్యాలరీలు ఉంటాయని వెల్లడైంది. అలాగే మొదట్లో చిక్కగా వచ్చే ముర్రుపాలలో మామూలు పాలలో కంటే 2-3 రెట్లు కొవ్వు, ఔన్సుకు 7-11 క్యాలరీలు అధికంగా ఉంటాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలివి..
కొవిడ్ పాజిటివ్ తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డకు పాలు పట్టవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతున్నది. అలాగే, వైరస్ సోకని తల్లులు కూడా కొవిడ్ మార్గ దర్శకాలు పాటిస్తూ బిడ్డకు పాలివ్వాలి. ఇప్పటివరకైతే తల్లిపాల ద్వారా బిడ్డకు వైరస్ వ్యాప్తి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవు.
తగిన జాగ్రత్తలు:
-మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
www.trudiet.in