శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 17, 2020 , 00:23:04

భర్త ఇంటి ముందు భార్య దీక్ష

భర్త ఇంటి ముందు భార్య దీక్ష

వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామానికి చెందిన సుర్కంటి రవీందర్‌రెడ్డి, సుజాతలు ఎదురెదురు ఇంట్లో ఉండేవారు. ఇద్దరు ప్రేమించుకొని పెద్దలకు తెలియకుండా ఆర్యసమాజ్‌లో 2015లో వివాహం చేసుకున్నారు. అనంతరం భార్యాభర్తలు అమెరికాలోని వర్జీనీయ రాష్ట్రంలో కాపురం పెట్టారు.  వీరి కాపురం ఏడాదిపాటు సజావుగా సాగగా, భర్త తండ్రి అమెరికాకు రావడంతో కాపురంలో కలహాలు ప్రారంభమయ్యాయి. సమస్యలు సద్దుమణిగే వరకు విడిగా ఉండమని భర్త సూచించాడు. ఆయన మాటలను నమ్మి బాధితురాలు వేరే ఇంట్లో కిరాయికి ఉన్నది.

కొంతకాలం తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండటంతో భర్తను నిలదీయగా, మా ఇంట్లో మన పెండ్లి ఇష్టంలేదని, విడాకులు తీసుకుందామని చెప్పడంతో తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన భార్య రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు 2018లో అమెరికాలో ఉన్న భార్యాభర్తలను ఇండియాకు రప్పించి విచారించారు. భార్య సుజాతను భర్త అత్తవారింట్లో వదిలిపెట్టి అమెరికాకు తిరిగి వెళ్లి పోయాడు. అప్పటి నుంచి అత్తవారింట్లో ఉన్న సుజాతను భర్త కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేస్తున్నా భరిస్తూ వచ్చింది. చివరికి అత్తమామలు ఇంట్లో నుంచి గెంటివేశారు. దీంతో చేసేదిలేక న్యాయం కోసం భర్త ఇంటి ముందు మంగళవారం దీక్ష చేపట్టింది.

VIDEOS

logo