జాతిరత్నాలు సినిమా సక్సెస్‌తో ఫుల్ జష్ మీదున్నాడు యువ నటుడు నవీన్ పొలిశెట్టి. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో తనలోని సెన్సాఫ్ హ్యూమర్‌ను ఆడియెన్స్ కు పరిచయం చేశాడు. జాతిరత్నాలు చిత్రంతో ఇండస్ట్రీలో బడా దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా చేసుకున్నాడు. ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యానర్లు నవీన్ తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నాయట. తాజా అప్డేట్ ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నవీన్ డేట్స్ ను లాక్ చేసుకున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
తన బ్యానర్లో సినిమా చేయాలని సైన్ చేయించుకున్న దిల్‌రాజు సరైన కథ దొరికిన వెంటనే నవీన్‌తో సినిమా మొదలుపెట్టాలనుకుంటున్నాడట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కథాబలమున్న సినిమాలు చేస్తూ కమర్షియల్ హిట్స్ కొట్టే నిర్మాతల్లో టాప్ ప్లేస్‌లో ఉంటారు దిల్‌రాజు. మరి నవీన్పొలిశెట్టితో సినిమా ఒకే అయితే ఎలాంటి స్టోరీని ప్రేక్షకులకు అందిస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.