సుబేదారి/కరీమాబాద్/హసన్‌పర్తి, నవంబర్ 21 : ఎంతో కష్టపడి పోలీసు కానిస్టే బుల్ కొలువు సాధించిన యువతీ యువకులు తమ శిక్షణను పూర్తిచేసుకున్నారు. మా మునూరు పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో 1,127 మంది మహిళలు, మడికొండ సిటీ పోలీసు శిక్షణ కళాశాల (సీపీటీసీ)లో 246 మంది పురుషులు, మొత్తం 1,373 మంది తొమ్మిది నెలల పాటు ట్రైనింగ్ పొందారు. 2022లో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు 2023లో పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లు వారి సొంత జిల్లాల్లో త్వరలోనే విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు గురువారం మామునూరు పీటీసీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ (దీక్షాంత్) పరేడ్‌కు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మడికొండ సీపీటీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు కొత్త కానిస్టేబుళ్లకు శుభాకాంక్ష లు తెలిపారు. శిక్షణ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి మెమెం టోలు అందజేశారు. పాసింగ్ అవుట్ పరేడ్‌కు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు తరలివచ్చి తమ వారిని పోలీసు దుస్తుల్లో చూసి మురిసిపోయారు.
ఓరుగల్లును ఏలిన రాణి రుద్రమదేవి స్ఫూర్తితో ముందుకు సాగాలని కొత్త మహిళా కానిస్టేబుళ్లకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను క నబరుస్తూ రాణించాలని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు.
కానిస్టేబుళ్లు శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమర్థవంతంగా విధులు నిర్వర్తించి పోలీసు శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పిలుపునిచ్చారు. శిక్షణ సమయంలో అలవర్చుకు న్న క్రమశిక్షణను రాబోయే రోజుల్లో కూ డా అనుసరించాలని సూచించారు. ఆ యా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడి యం కావ్య, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇంజా రపు పూజ, రవి, అదనపు డీసీపీలు రవి, శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రమణబాబు, ఏసీపీలు తిరుమల్, సురేంద్ర, అనంత య్య, ఆర్ఐ ఉదయ్‌భాస్కర్, శ్రీనివాస్, శ్రీధర్, స్పర్జన్‌రాజ్, ఇన్స్పెక్టర్లు రవికు మార్, మంగీలాల్, కిషన్ పాల్గొన్నారు.
నేను 7వ తరగతి వరకు చదివి 2005లో హోంగార్డుగా చేరా. ఆ తర్వాత ఓపెన్‌లో టెన్త్, ఇంటర్ పూర్తి చేశాను. 2007 నుంచి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. 8వ సారి సక్సెస్ అయ్యాను. నాకు ఇద్దరు పిల్లలు. నా భార్య, మేనమామ ప్రోత్సాహంతో 2023లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాను.
– ఈ మొగులయ్య, కొండగట్టుపల్లి, మహబూబ్‌నగర్