‘తూర్పు’ అభివృద్ధే లక్ష్యం
వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 36వ డివిజన్ చింతల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఇతర పార్టీల నేతలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
- ప్రతి డివిజన్లో మౌలిక వసతులు కల్పిస్తున్నా
- రూ. 77 కోట్లతో వరద కాల్వల నిర్మాణం
- ముంపు కాలనీల్లో మెరుగైన సౌకర్యాలు
- మైనార్టీల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే నన్నపునేని
- పలు పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిక
వరంగల్ చౌరస్తా, నవంబర్ 6: వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 36వ డివిజన్ చింతల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఇతర పార్టీల నేతలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, ప్రతి డివిజన్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో 36వ డివిజన్ పరిధిలోని చింతల్ పుప్పాలగుట్ట ప్రాంతంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించామన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు మరో అవకాశం కల్పించాలని కోరారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మైనార్టీలకు తూర్పు నియోజకవర్గంలో నాలుగు స్థానాలు కేటాయించడంతోపాటు అండర్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన పేద, మధ్య తరగతి మైనార్టీ కుటుంబాల కోసం షాదీఖాన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వరద ముంపు నివారణకు సుమారు రూ. 77 కోట్లతో కాల్వ నిర్మాణం పనులు చేపట్టామని, త్వరలోనే పూర్తి కానున్నట్లు వెల్లడించారు. పనులు పూర్తయితే వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వరంగల్ నగరాన్ని బీఆర్ఎస్ సర్కారు హెల్త్ హబ్‌గా మార్చేందుకు రూ. 1200 కోట్లతో 24 అంతస్తుల ఆధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నదనారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య, మర్రి శ్రీనివాస్, రమేశ్, షమీమ్, షాబొద్దీన్, కిట్టు, అనిల్, మధు, రాజు, వేల్పుగొండ రేణుక, అంకుస్, లావణ్య, రాజేందర్, అజయ్ పాల్గొన్నారు.
మైనార్టీలకు సీఎం కేసీఆర్ అండ
కరీమాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. శంభునిపేటలో నిర్వహించిన గ్యార్మీ షరీఫ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్లో మైనార్టీలకు కార్పొరేటర్ టికెట్లతోపాటు కో ఆప్షన్‌గా అవకాశం కల్పించామన్నారు. అలాగే, నియోజకవర్గంలో ఈద్గాలు, మసీదులు, ఖబ్రస్థాన్లను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందిస్తామని, బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోశాల పద్మ, మైనార్టీల ఇన్చార్జి ఎంఏ జబ్బార్, డివిజన్ అధ్యక్షుడు ఈదుల రమేశ్, నాయకులు పోశాల స్వామి, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి, హసన్ అలీబేగ్, ముస్లిం పెద్దలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం నన్నపునేని సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో కొత్త, పాత తేడాలేకుండా నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే గౌడ కులస్తుల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఉర్సులో నాగపురి సంజయ్‌బాబు అధ్యక్షతన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తున్నదన్నారు. అనంతరం గౌడ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మండ వెంకన్నగౌడ్, బత్తిని హరిప్రసాద్, మాజీ కార్పొరేటర్లు నాగపురి కల్పన, నాగపురి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

