జయశంకర్ భూపాలపల్లి, మే 8 (నమస్తే తెలంగాణ): కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం వద్ద త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు జరిగే సరస్వతీ (అంతర్వాహిణి) పుష్కరాలకు అభివృద్ధి పనులు హడావిడిగా కొనసాగుతున్నాయి. ఆలయాని కి పాలక మండలి లేకపోవడం, ఇన్చార్జి ఈవోను ఆలస్యంగా నియమించడం, అభివృద్ధి పనులకు నిధు లు ఆలస్యంగా మంజూరు చేయడంతో పనులు పుష్కరా లు ప్రారంభమయ్యేలోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఆలస్యంగా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తుండడం తో నా ణ్యతను గాలికి వదిలేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చేసిన పనులకు క్యూరింగ్ లేకపోవడంతో ని ర్మాణాలు పగుళ్లు తేలుతున్నాయి. ప్రభుత్వం పుష్కర పనుల కోసం రూ.25కోట్లు మంజూరు చేసి నా పను లు పూర్తి చేయడంలో అడుగడుగునా నిర్ల క్ష్యం కనిపిస్తున్నది. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి స్వయం గా పర్యవేక్షిస్తూ ఆదేశాలిస్తున్నా పనులు ముం దుకు సాగడం లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం పలు పనులను రద్దు చేసిందని, అవి ఎటు మళ్లించారని గ్రామస్తులు ప్రశిస్తున్నారు. మంత్రి ఇలాకాలోని ఈ పరిస్థితులు పాలకులు, అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నా యి. వారం రోజుల్లో పుష్కరాలు ప్రారం భం కానుండగా ఇప్పటికీ ఆలయానికి పా లకవర్గాన్ని నియమించలేదు. త్రివేణి సం గమం వద్ద జలాలు అడుగండడంతో పు ష్కర స్నానాలకు తిప్పలు తప్పేటట్టు లేదు.
పుష్కరాలలోగా పూర్తయ్యేనా
కాళేశ్వరంలో పుష్కరా పనులు వారం రోజుల్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఈ నెల 10 వరకే పూర్తి చేయాలని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్య ర్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించినా ఎలాంటి పురోగతి లేదు. రూ.25 కోట్లతో 63 పనులు చేయాలని నిర్ణయించినప్పటికీ మళ్లీ ఎస్టిమేషన్ మార్చి పనుల సంఖ్య తగ్గించారు. ముఖ్యంగా పుష్కరఘాట్ వద్ద ఆర్చి పనులు ఇంకా కొనసాగుతూనే ఉండగా, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వంద గదుల వసతి గృహానికి తు ది మెరుగులు దిద్దడంలో తీవ్ర జాప్యం చే స్తున్నారు. పుష్కరాలకు వచ్చే పీఠాధిపతుల విడిది గృహం పనులు అలాగే ఉన్నాయి. వాటర్ ట్యాంకు నిర్మాణం సగం కూడా పూర్తి కాలేదు. కల్యాణ కట్ట, పిండ ప్రదానం చేసే భవనం నిర్మాణ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. పుష్కరఘాట్ నుంచి వీఐపీ ఘాట్ వరకు మట్టి రోడ్డు పనులు, మసీదు నుంచి వీఐపీ ఘాట్ వరకు డబుల్ రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
‘బీఆర్ఎస్’ పనులు పక్కకు..
కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆలయ పరిధిలో 32 పనులు చేపట్టి, వీటి పర్యవేక్షణ బాధ్యతలను దేవాదాయ, పంచాయతీరాజ్, అటవీ, ఉద్యానశాఖ, సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించిం ది. ఆలయ ప్రధాన ద్వారం ముందు ఫ్లోరింగ్, కిచెన్‌తో కూడిన హాలు, పేద యాత్రికులు ఉచితంగా వసతి పొందడానికి పదిహేను గదులతో సముదాయం, క్యూ కాంప్లెక్స్, గోదావరి వద్ద పురోహితులు అస్తికల నిమజ్జన పూజలు చేయడానికి, కేశఖండనకు కల్యాణకట్ట, అస్తికలు గోదావరిలో కలపటానికి వచ్చే వారు పడుకోవడానికి ప్రత్యేకంగా పదిహేను గదులతో అపరకర్మ మండపం, ఆల యం వద్ద షాపింగ్ కాంప్లెక్స్, వంద గదులతో ధర్మశాల,
ఆది ముఖేశ్వరస్వామి ఆలయం సమీపంలో నలభై గదులతో డార్మిటరీ, నది వద్ద ఉన్న స్నానఘట్టాల నుంచి బస్‌స్టేషన్ వరకు డ్రైనేజీ, రోడ్డు నిర్మాణం, ఆలయ ప్రహరీ, ప్రధాన దేవాల యం ముందు మహా, అభిషేక మండపం, సాలహారం, శ్రీరామాలయం వద్ద ఆర్చి, ప్రహరీ, పాకశాల, కొత్త ధ్వజస్తంభం, శ్రీ శివ కల్యాణ మండ పం, ఆలయం ఉత్తర, దక్షిణ, పశ్చిమ రాజగోపురాలకు కర్ర డోర్లు, సాలహారం నుంచి సరస్వతీ టెంపుల్ వరకు ప్రహరీ, శ్రీపార్వతి అమ్మవారి ఆలయం మండపం విస్తరణ పనులకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చాలా వరకు పూర్తి చేసింది. మిగిలినవి పూర్తి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. ఈ నిధులు ఎటు వెళ్లాయో తెలియని పరిస్థితి ఉంది.