మడికొండ, మార్చి 11: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మహిళలకు సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మడికొండలోని రాజరాజేశ్వరి గార్డెన్స్‌లో విజేతలకు శనివారం బహుమతులు ప్రదానం చేశారు. అలాగే, నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులతోపాటు పలు రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా సిబ్బందిని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా గౌరవం పొందినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు, బాలికలను సమానంగా గౌరవించి ఆదరించడం ప్రతి పురుషుడి ధర్మమన్నారు. మహిళ పెళ్లి అనే బంధంతో తమ కుటుంబాన్ని వదిలి.. తమ భర్త, పిల్లలకు సేవ చేస్తూ సర్వస్వం ధారపోస్తుందని తెలిపారు. తమ తండ్రి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, సెర్ప్ అధికారి రవీందర్, కార్పొరేటర్లు మునిగాల సరోజన, ఈదురు అరుణ, ఇండ్ల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ బస్కె శ్రీలేక, బీఆర్ఎస్ నాయకులు బొల్లికొండ వినోద్‌కుమార్, దువ్వ శ్రీకాంత్, పోలెపల్లి రామ్మూర్తి, దువ్వ నవీన్, కంకణాల సంపత్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, స్పందన్, అల్లం శ్రీనివాసరావు, నర్మెట భిక్షపతి, ఫౌండేషన్ సీఏ రాజు పాల్గొన్నారు.