ప్లాస్టిక్ ఫ్రీ సిటీ సాధ్యమయ్యేనా.. ప్రత్యేక కార్యాచరణ లేని బల్దియా
మానవ మనుగడకు సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ మహమ్మారిని వరంగల్‌లో నిర్మూలించడం సాధ్యమయ్యేనా? చారిత్రక నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మార్చాలన్న కలలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా వీటి వినియోగం విరివిగా కనిపిస్తున్నది. అరికట్టాల్సిన బల్దియా అధికారులు అడపాదడపా తనిఖీలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.
- ప్రత్యామ్నాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కరువు
- జరిమానాలతో చేతులు దులుపుకుంటున్న అధికారులు
- ప్రజల్లో చైతన్యం తేవడంలో గ్రేటర్ కార్పొరేషన్ విఫలం
వరంగల్, ఆగస్టు 1 : మానవ మనుగడకు సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ మహమ్మారిని వరంగల్‌లో నిర్మూలించడం సాధ్యమయ్యేనా? చారిత్రక నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మార్చాలన్న కలలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా వీటి వినియోగం విరివిగా కనిపిస్తున్నది. అరికట్టాల్సిన బల్దియా అధికారులు అడపాదడపా తనిఖీలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగంతో వచ్చే నష్టాలపై ప్రజ ల్లో చైతన్యం తీసుకురావడంతో గ్రేటర్ కార్పొరేషన్ పూర్తిగా విఫలమవుతోంది. ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లు తిరుగుతున్నా అంతగా ఫలితాలు రావ డం లేదు. చిరు వ్యాపారుల నుంచి అన్ని షాపుల్లో వీటి వినియోగిస్తూనే ఉన్నారు. నగర నాలాల పూడికతతీ సమయంలో బయటపడిన ప్లా స్టిక్ కవర్లు చూస్తే వినియోగం ఎంతుందో అర్థమవుతుంది. నాలాలతో పాటు అంతర్గత కాల్వల్లోనూ కవర్లు నిండిపోయి మురుగు నీరు సాఫీగా ప్రవహించకుండా అడ్డుగా నిలిచి చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి వస్తున్నాయి.
ప్రత్యామ్నాయమేదీ?
ప్లాస్టిక్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం చూపడంలో బల్దియా నుంచి ప్రోత్సాహం కరువుతోంది. ఈజీ క్యారింగ్ అనే ఆలోచనలతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి అలవాటు పడిన ప్రజలకు పేపర్, జ్యూట్ బ్యాగ్‌లను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించడం లేదు. ప్లాస్టిక్ వినియోగం నుంచి ప్రజలను మళ్లించేందుకు కార్యాచరణ లేకపోవడం గమనార్హం. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు జ్యూట్ బ్యాగ్‌లు, పేపర్ బ్యాగ్‌ల తయారీలో శిక్షణ ఇచ్చిన అధికారులు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడంలో సహకారం అందించడం లేదు. వీరికి తోడ్పాటునందిస్తే ప్లాస్టిక్ మహమ్మారిని అరికట్టడం సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లలో ప్రత్యేకంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో జ్యూట్, పేపర్ బ్యాగ్ విక్రయ స్టాళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడప్పుడు తనీఖీలు, జరిమానాలతో చేతులు దులుపుకుంటే నగరంలో ప్లాస్టిక్ నిర్మూలించడం సాధ్యం కాదన్న వాదనలు వినవస్తున్నాయి.
ట్రాన్స్‌పోర్టుల ద్వారా నగరంలోకి..
నిషేధిత ప్లాస్టిక్ రవాణాపై నిఘా పెట్టాలి. బయటి జిల్లాల నుంచి కవర్లు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి డైలీ సర్వీస్‌లు అందిస్తున్న ట్రాన్స్‌పోర్ట్‌లపై ప్రత్యేక నిఘా పెట్టాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. కొత్త మున్సిపల్ చట్టంలో పొందుపర్చిన ప్రకారం 50 మైక్రాన్ కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను విక్రయిస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. వీటన్నింటినీ విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్లాస్టిక్ హోల్‌సేల్, చిరు వ్యాపారులు, మటన్, చికెన్ షాపుల నిర్వాహకులకు అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కోసం బల్దియా ఉద్యమాన్ని చేపట్టాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, విద్యార్థులను భాగ స్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా కాల పరిమితిని నిర్ధేశించుకుని దానికనుగుణంగా కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేస్తే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కల నెరవేరే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

