నర్సంపేటరూరల్, డిసెంబర్ 12 : మండలంలోని మహేశ్వరం గ్రామంలో ఉన్న శ్రీ గురుకుల విద్యాలయం లో 2003-04 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మోతె సమ్మిరెడ్డితో పాటు ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోవర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకటరమణ, స్వామినాథన్, తిరుపతిరెడ్డి, వెంకటేశ్వర్లు, రమేశ్, విద్యార్థులు మధుకర్, నాగరాజు, వెంకటరమణ, రాజు, కీర్తన, స్వప్న, ప్రియ, ప్రజలవాణి పాల్గొన్నారు.
రాయపర్తిలో ..
రాయపర్తి: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 22 సంవత్సరాల క్రితం పాఠశాలలో పదో తరగతి చదివిన మండలంలోని రాయపర్తి, కొత్త రాయపర్తి, మైలారం, మహబూబ్‌నగర్, రాగన్నగూడెం, తిర్మలాయపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు సమ్మేళనంలో కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు సోడెపు శ్రీనివాస్, మహ్మద్ రఫి, మచ్చ రమేశ్, మహ్మద్ అజారుద్దీన్, కుంట ప్రభాకర్, మహ్మద్ అప్సర్‌పాషా, మచ్చ రాజు, మహ్మద్ కలీం, చిన్నాల రాజు, మహబూబ్‌పాషా, ఇజ్జగిరి రాజు, ఎండీ సర్వర్, మచ్చ అశోక్‌కుమార్, మహ్మద్ యూసుఫ్, బీరెల్లి బాబు, మహ్మద్ మన్సూర్, లింగయ్య, వేముల రమేశ్ పాల్గొన్నారు.
సాహితీ పాఠశాలలో…
దుగ్గొండి: మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఉన్న సాహితీ పాఠశాలలో పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2001-02 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం అప్పటి గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం హింగె భుజంగరావు- గీత, ఉపాధ్యాయులు రాజేశ్వరరావు, అచ్చయ్య, రాజయ్య, బాబూరావు, కోడెం ఐలోని, పోలోజు రఘుమూర్తి, ఇంద్రసేన, రమేశ్, భాస్కర్, విద్యార్థులు యుగేంధర్, రాంబాబు, సుధీర్, రాజు, అశోక్, చిరంజీవి, సుమలత, స్వప్న, శైలజ, హైమావతి, సువర్ణ, సుజాత, నీరజ, శ్రీధర్ పాల్గొన్నారు.