నర్సంపేట, నవంబర్ 28: మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. నర్సంపేట పట్టణంలో జరిగిన ఫూలే 131వ వర్ధంతిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు భూక్యా సమ్మయ్య, ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్, పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి గుర్రం అజయ్ వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫూలే స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి ఆయన అండగా నిలిచారని కొనియాడారు. అందరికీ చదువు ఎంతో అవసరమని గుర్తించి, ఎన్నో పాఠశాలలను నెలకొల్పిన గొప్ప సంఘ సంస్కర్త ఫూలే అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారని గుర్తుచేశారు. సామాజిక ఉద్యమ నాయకుడు మహాత్మా జ్యోతిరావు ఫూలేను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, గుజ్జుల ఉమ, కందికొండ రాజు, మారపెల్లి అశోక్, సింగారపు బాబు, విలియం కేరి, సురేశ్, రమేశ్, సుస్మిత, ఆశాదేవి, మౌనిక, సోనియా, అనూష, శ్రీలత, అశోక్, రాజు, కార్తీక్, ప్రవీణ్, కిరణ్, అఖిల్, సుశాంత్, సంపత్, రాకేశ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫూలే అడుగు జాడల్లో నడువాలి
మహాత్మా జ్యోతిరావు ఫూలే అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్, ఏబీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ పిలుపునిచ్చారు. దుగ్గొండితోపాటు గిర్నిబావిలోని గురుకులంలో ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధన్నపేట మండలంలోని ప్రజాసంఘాలు, దళిత సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతి నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి పాల్గొని ఫూలే సేవలను కొనియాడారు. రాయపర్తి మండలవ్యాప్తంగా ఫూలే వర్ధంతి నిర్వహించారు. రాయపర్తిలో జడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ భద్రునాయక్, ఐత మల్లేశ్, రావుల అనిల్, ఐత సంపత్, జెరుపోతుల కృష్ణ, మైస మహేందర్, ఐత విష్ణు, రాజు, మారుతి, భాస్కర్ పాల్గొన్నారు. సంగెంలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి నిర్వహించారు. సంఘ సంస్కర్త కోడూరి వెంకట్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలో ఫూలే చిత్రపటానికి ఎంపీపీ కందకట్ల కళావతి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ గుండేటి బాబు, ఎంపీటీసీ మెట్టుపెల్లి మల్లయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కందకట్ల నరహరి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసం సాంబయ్య, నియోజకవర్గ ఇన్చార్జి మాదినేని కోటేశ్వర్, మండల అధ్యక్షుడు గన్ను సంపత్, తదితరులు పాల్గొన్నారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. వరంగల్ ఉర్సు దర్గా సమీపంలో నవయువ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతి నిర్వహించారు. పర్వతగిరిలో స్వేరోస్ ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతి నిర్వహించారు. స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారె జయరాజ్, మండల ఉపాధ్యక్షుడు మచ్చ రవి, కోశాధికారి భూక్యా ప్రవీణ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బానోత్ రమేశ్, సతీశ్, మోహన్, శ్రీధర్, నిషాన్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. వరంగల్ కాశిబుగ్గలో నిర్వహించిన వేడుకల్లో సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బేతి రాజు పాల్గొని ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంక్షేమ సంఘం సభ్యులు ధర్మపురి రామారావు, వేణు, సాంబశివ, రమేశ్, రాజు, కృష్ణ పాల్గొన్నారు. గీసుగొండతోపాటు చంద్రయ్యపల్లిలో నిర్వహించిన ఫూలే వర్ధంతిలో ఎంపీపీ భీమగాని సౌజన్య పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. కార్యక్రమంలో చంద్రయ్యపల్లి సర్పంచ్ ఆకుల స్రవంతి, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు మాదాసి రాంబాబు, టీజేఎస్ నాయకులు కర్ణకంటి రామ్మూర్తి, నాయకులు శ్రీకాంత్, దేవేందర్, అశోక్, రాజు, కృష్ణ, కుమారస్వామి పాల్గొన్నారు.