తొర్రూరు/ హన్మకొండ/ వర్ధన్నపేట/ రాయపర్తి, ఆగస్టు 13 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ప్రతి ఇల్లూ త్రివర్ణశోభితం కావాలని, మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన హనుమకొండ, వర్ధన్నపేట, రాయపర్తి, తొర్రూరులో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీల్లో పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి, ఛీప్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఫ్రీడం ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ జెండాలతో బాలసముద్రంలోని జేఎన్ఎస్ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్ధన్నపేటలోని ఫిరంగిగడ్డ ప్రభుత్వ పాఠశాల నుంచి జాతీయ రహదారిపై ఉన్న బస్టాండ్, అంబేద్కర్ సెంటర్ వరకు, రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల సముదాయం నుంచి వరంగల్-ఖమ్మం జాతీ య రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు, తొర్రూరులోని జిల్లా పరిషత్ హైసూల్ నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు.
శాంతికి చిహ్నంగా పావురాలను గాలిలోకి ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మా ట్లాడుతూ.. సుమారు 200 ఏళ్లపాటు పరాయి పాలనలో బందీలుగా ఉన్న భారతీయులను విముక్తులను చేసేందుకు నాడు ఎందరో మహనీయులు అలుపెరుగని పోరాటాలు చేశారని అన్నారు. వారి ఆత్మ బలిదానాల కారణంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. సమరయోధుల స్ఫూర్తితో వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 22 వరకు జరిగే కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. స్వాతం త్య్ర స్ఫూర్తిని చాటేలా గ్రామగ్రామాన, వాడవాడలా అద్భుతంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహిసున్నదని తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం నాడు శాంతియుత మార్గంలో పోరాటం సాగించిన మహత్ముడి స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు తెలిసేలా ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. త్వరలోనే అన్ని పాఠశాలల్లో గాంధీ జీవిత చరిత్ర, భారత స్వాతంత్య్ర ఉద్యమంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, ప్రతిభ చూపిన వారికి తదుపరి చదువుల నిమిత్తం సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని ప్రకటించారు. ఈ నెల 16న తలపెట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
భరతమాత, గాంధీ, దేశభక్తుల వేషధారణలతో వివిధ పాఠశాలల నుంచి ర్యాలీకి వచ్చిన చిన్నారులతో కలిసి నడిచారు. తొర్రూరులో మంత్రి, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర హైస్కూల్ నుంచి బస్టాండ్ వరకు బుల్లెట్ వాహనాలపై ర్యాలీగా వెళ్లి సందడి చేశారు. హనుమకొండలో డీసీపీ అశోక్‌కుమార్, అదనపు డీసీపీ పుష్పారెడ్డి, సంజీవ్, ఏసీపీలు, సీఐలు, వర్ధన్నపేటలో ఏసీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, సీఐ సదన్‌కుమార్, కమిషనర్ గొడిశాల రవీందర్, రాయపర్తిలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగుకుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, మండల అధ్యక్షుడు నర్సింహానాయక్, తహసీల్దార్ సత్యనారాయణ, మండల ప్రత్యేకాధికారి నరేశ్‌కుమార్‌నాయుడు, ఎంపీడీవో కిషన్‌నాయక్, ఎంపీవో రామ్మోహన్, ఏవో వీరభధ్రం, ఏపీఎం అశోక్‌కుమార్, ఎంఈవో నోముల రంగయ్య, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జయకుమారి, గిర్దావర్ చంద్రమోహన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సత్యవతి, విజయలక్ష్మి, నాయకులు పూస మధు, నర్సయ్య, రాంచందర్, బిల్ల సుభాష్‌రెడ్డి, నయీం, వనజారాణి, రాంచంద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, చిట్యాల వెంకటేశ్వర్లు, యాదగిరిరెడ్డి, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, తొర్రూరులో ఆర్డీవో ఎల్ రమేశ్, డీఎస్పీ వై రఘు, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ సోమేశ్వర్రావు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ వెంకటనారాయణగౌడ్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ శ్రీనివాసరావు, దొంగరి రేవతీశంకర్, మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీధర్, సీఐ సత్యనారాయణ, తహసీల్దార్ రాఘవరెడ్డి, కమిషనర్ గుండె బాబు, ఎస్సైలు సతీశ్, రాజు, జిల్లా అకాడమిక్ కో-ఆర్డినేటర్ బుచ్చయ్య, ఎంఈవో రాము, బిజ్జాల అనిల్, ధరావత్ జైసింగ్, తూర్పాటి రవి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ పరిశీలకురాలు పంజా కల్పన, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు ఎండి జలీల్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు, సేవా తరుణి, టీచర్స్ క్లబ్ ఆర్సీ రేగూరి వెంకన్న, దామెర సరేశ్, అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, కృష్ణమూర్తి, విశ్వేశ్వర్రావు, వజినెపల్లి దీప, వాణి, రాయపెల్లి యాకయ్య, తొర్రూరు హైస్కూల్ హెచ్ఎం శ్రీనుబాబు పాల్గొన్నారు.