వరంగల్‌చౌరస్తా/కరీమాబాద్, ఆగస్టు 7: ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాల కార్యక్రమాన్ని నగరవ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 36వ డివిజన్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ స్థానికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ 32, 39, 40, 41, 42 డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన ఆధ్వర్యంలో ప్రజలకు వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లం రవి, పోశాల స్వామి, గుండు పూర్ణచందర్, ఈదుల రమేశ్, ఈదుల భిక్షపతి, కలకోట్ల రమేశ్, టీఆర్ఎస్ నాయకులు, గ్రేటర్ పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
నీరునిల్వ లేకుండా చూసుకోవాలి
వరంగల్ 28వ డివిజన్లో డెంగ్యూ, మలేరియా స్పెషలాఫీసర్ శ్రీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పాత టైర్లు, రంజన్లు, కుండల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కార్పొరేషన్ పారిశుధ్య సిబ్బంది నీరునిల్వ ఉన్న చోట దోమల నివారణ మందును పిచికారీ చేశారు. కార్యక్రమంలో జవాన్ శ్రీనివాస్, ఆర్పీ శ్రీదేవి పాల్గొన్నారు. అలాగే, 26వ డివిజన్లో కార్పొరేటర్ బాలిన సురేశ్ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. 12వ డివిజన్ కార్పొరేటర్ కావేటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో 10 గంటలకు పది నిమిషాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్లోని కేఎల్ మహేంద్రనగర్‌లో ఇంటింటికీ తిరిగి పరిసరాలను పరిశీలించారు. పాతటైర్లు, పాత కుండల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంకులపై మూతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ స్పెషలాఫీసర్ ఎం ప్రతిభ, శానిటరీ జవాన్ ఆర్ సాంబయ్య, పీ శివప్రసాద్, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.