సుబేదారి, నవంబర్ 22 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్యారడైజ్ బిర్యానీ ఇప్పుడు చారిత్రక ఓరుగల్లు మహానగరానికి వచ్చేసింది. ఇన్నాళ్లు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్యారడైజ్ బిర్యానీకి ఓరుగల్లు నగరాన్ని జోడించింది. కొద్ది రోజుల క్రితమే హనుమకొండ సుబేదారిలోని డీఐజీ బం గ్లా ఎదురుగా ప్యారడైజ్ బిర్యానీ ఔట్లెట్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్, తెలంగాణ వాసులకు వరంగల్ మహానగరం వీకెండ్ గేట్ వేగా నిలుస్తోంది. మహానగరానికి ప్యారడైజ్ ఔట్లెట్ రెస్టారెంట్ రావడంతో వరంగల్ నగరవాసులకు, సందర్శకులకు చక్కటి విందు అందుబాటులోకి వచ్చింది. అత్యుత్తమైన, రుచికరమైన బిర్యానీ, కబాబ్స్ మరెన్నో ఆహార పదార్థాలు అతిథులు ఆస్వాదించవచ్చు. వీటిని అతిథులకు అసాధారణ నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలతోఅనుగుణంగా అందిస్తున్నారు. హనుమకొండ చుట్టుపక్కల ప్రాంతాల భోజన ప్రియులు, ఇప్పుడు ప్యారడైజ్ ప్రతిష్టాత్మక బిర్యానీ, కబాబ్స్, డెస్టర్స్ను ఆస్వాదించడానికి ఆసక్తితో రెస్టారెంట్‌కు వస్తున్నారు. వరంగల్ నగరంలో ప్యారడైజ్ రెస్టారెంట్ ఆవిష్కర ణ గురించి ప్యారడైజ్ ఫుడ్కోర్ట్ చైర్మన్ అలీ హేమతి మాట్లాడుతూ తమ ప్యారడైజ్ నూతన ఔట్లెట్ ప్రారంభానికి హనుమకొండ వేదికగా నిలుస్తోందన్నారు.
హైదరాబాద్ నగరానికి సమీపంలో వరంగల్ నగ రం ఉందని, ఇక్కడి నుంచి వ్యాపారవేత్త లు, విద్యార్థులు, వివిధ రంగాలకు చెందినవారు హైదరాబాద్ ప్యారడైజ్‌కు వస్తుంటారని, వరంగల్ సంస్కృతులను, కాకతీయ కాలంనాటి వైభోగం ఇక్కడ ప్రదర్శిస్తున్న ట్లు తెలిపారు. ఆహారప్రియులకు ఓరుగల్లు వైభవ రుచికరమైన విందు సమ్మేళనంగా నిలుస్తుందని చెప్పారు. హనుమకొండలో ఔట్లెట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్యారడైజ్ డైరెక్టర్ డాక్టర్ కజీమ్ హేమతి ఆనందం వ్యక్ంతచేశారు. హనుమకొండలో ప్రారంభించిన ఔట్లెట్ రెస్టారెంట్ 43వది. ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ రికార్ట్‌లో ఒకే సంవత్సరంలో అత్యధిక బిర్యానీలు సర్వ్ చేసిన రెస్టారెంట్ చైన్‌గా ప్యారడైజ్ ఖ్యాతికెక్కిందని ప్యారడైజ్ సీఈఓ గౌతమ్ గుప్తా అన్నారు. 2018లో 90లక్షల మంది మార్క్‌ను అధిగమించింది. ఆసియా ఫుడ్ కాంగ్రెస్‌లో అత్యత్తుమ బిర్యానీ రెస్టారెంట్‌గా వడ్డించినదని ప్యారడైజ్ రికార్డు సాధించింది. ఇండియా ఫుడ్ఫోర్ నుంచి 2028లో గోల్డెన్ స్పూన్ అవార్డును దక్కించుకుంది. తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్స్, జీహెచ్ఎంసీ, టైమ్స్ ఫుడ్ అవార్డు, ఫ్రైడ్ ఆఫ్ తెలంగాణ, లైఫ్‌టైమ్ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ప్యారడైజ్ అందుకుందని సంతోషం వ్యక్తంచేశారు.