కరీమాబాద్, ఏప్రిల్ 24 : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ అన్నారు. వరంగల్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్కు క్రిస్టియన్లు మద్దతు తెలుపుతూ కరీమాబాద్‌లోని రామ్‌లక్ష్మణ్ గార్డెన్లో శనివారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్ పాల్గొని మాట్లాడుతూ క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్‌ను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. పార్టీకి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. రూ.కోటితో సీబీసీ చర్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, క్రిస్టియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తూర్పు నియోజకవర్గ అభ్యర్థులకు దిశా నిర్దేశం
వరంగల్ : గ్రేటర్ ఎన్నికల్లో విజయం మనదేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం శాంతినగర్‌లోని రాజశ్రీ గార్డెన్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థులు, డివిజన్ ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తూర్పులోని 24 డివిజన్లలో విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగాలన్నారు. అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ప్రతి డివిజన్లో టీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గ్యాద రి బాలమల్లు, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్‌నాయక్, కోరుకంటి చందర్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పాల్గొన్నారు.