e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జనగాం దివ్యాంగులు దైవ సమానులు

దివ్యాంగులు దైవ సమానులు

వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట
దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలకుపలు సంక్షేమ పథకాలు
టీ డయాగ్నస్టిక్‌ సెంటర్లతో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు
రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
సీఎం కేసీఆర్‌ పాలనలోప్రజలు సంతోషంగా ఉన్నారు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర

కృష్ణకాలనీ, జూన్‌ 16 : దివ్యాంగుల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి సేవాసమితి భవన్‌లో జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 101 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ పాలనలో ది వ్యాంగులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందారన్నారు. గతంలో దివ్యాంగులకు నెలకు రూ. 500 పెన్షన్‌ ఉంటే సీఎం కేసీఆర్‌ రూ. 3016లకు పెంచారన్నారు. దివ్యాంగులకు ఆసరాగా ఉండేందుకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, కాలిపర్స్‌, ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ పంపిణీ చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలతో పాటు, ఓసీ నిరుపేదలు ఆ ర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. ఏడేళ్లలో భూపాలపల్లిలో ఎంతో అభివృద్ధి జరిగిందని, సీఎం కేసీఆర్‌ భూపాలపల్లిని ప్రత్యేక జిల్లా చేసి ఆయనకు ఇష్టమైన వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు పెట్టారన్నారు. రాష్ట్రంలో టీ డయాగ్నస్టిక్‌ సెంటర్ల ఏర్పాటుతో 57 టెస్ట్‌లు ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి ఒక్కరూ సర్కారు వైద్యం చేసుకునేందుకు మక్కువ చూపుతున్నారన్నారు.

కొవిడ్‌ నేపథ్యంలో ప్ర జలకు మెరుగైన వైద్యం అందించేందుకు జి ల్లాలోని 100 పడకల దవాఖానలో 30 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. కరోనా సమయంలో ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల సేవలు మరువలేనివన్నారు. ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచ ర్ల జీతభత్యాల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో వారి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్‌ ప్రపంచం మెచ్చుకునేలా జీతాలు పెంచి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారన్నారు. భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 40వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలోని 63లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7500 కోట్లు రైతుబంధు కింద జమ చేశారన్నారు. జిల్లా కేంద్రంలో త్వరలో టీ డయాగ్నస్టిక్‌ సెంటర్‌తో పాటు ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రపంచం మెచ్చుకునేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చిన మహనీయుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతులకు తాగు, సాగు నీరు అందించిన దేవుడు సీఎం అన్నారు. రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దివ్యాంగులకు విద్యలో రిజర్వేషన్లతోపాటు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. గ్రూప్‌ 1, 2 ఉద్యోగాల కోసం దివ్యాంగ విద్యార్థులకు కోచింగ్‌ సెంటర్లలో డబ్బులు వెచ్చించి చదివిస్తున్నదన్నారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. సీఎం కేసీఆర్‌ రూ. 1800 కోట్లతో వికలాంగుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన సబ్సిడీ రుణాల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు 180 యూనిట్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అన్నిరంగాల్లో ప్రాధాన్యమిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నదని, దివ్యాంగులమంతా సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో జేసీ స్వర్ణలత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, టీఆర్‌ఎస్‌ భూపాలపల్లి టౌన్‌, మండల పార్టీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మందల రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌, పూర్ణచంద్రారెడ్డి, డీడబ్ల్యూవో శ్రీదేవి, ఆర్డీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement