హనుమకొండ చౌరస్తా, నవంబర్ 8: వరంగల్ నిట్‌లో సాంకేతిక సంబురం ఉత్సాహంగా ప్రారంభమైంది. మూడు రోజుల టెక్నోజియాన్-24 ఉత్సవాలకు దేశంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల నుంచి సుమారు వేయి మంది, నిట్‌లోని ఐదు వేల మంది విద్యార్థులతో సందడిగా మారింది. శుక్రవారం సాయంత్రం అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో హైదరాబాద్ సీఎస్ఐఆర్ ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్వీ చౌదరి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానాన్ని, నెట్వర్ను పరస్పరం మార్పిడి చేసుకోవడా నికి ఇలాంటి సాంకేతిక కార్యక్రమాలు గొప్ప వేదిక అని అన్నారు. టెక్నోజియాన్ నుంచి అను భవాలు వారిని డొమైన్లో మరింత బలపరుస్తాయని, వారి కెరీర్ అవకాశాలను మెరుగుపరచ డంలో సహాయపడతాయని ఆయన ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి దీన్ని ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకోవాలని, ఈవెంట్లలో పాల్గొని దేశంలోని సమస్యలకు పరిషారాలను అందించా ల్సిన అవసరం ఉందని డాక్టర్ చౌదరి అన్నారు.
టెక్నికల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ హరిప్రసాద్‌రెడ్డి టెక్నోజియాన్ గురించి వివరించారు. రోబోటిక్స్ క్లబ్ నేడు సాయంత్రం 6 గంటలకు ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో 100 మందికిపైగా పాల్గొంటున్నారు. సవాలుగా ఉన్న ఇంజినీరింగ్ సమస్యలను పరిషరించేందుకు విద్యార్థుల కోసం 48 గంటల హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ డీ శ్రీనివాసాచార్య తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి సమన్వయకర్త శ్రీ ఇషాన్, డాక్టర్ బీ శీనివాస్, డాక్టర్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
టెక్నోజియాన్‌లో భాగంగా నేటి నుంచి రెండురోజుల పాటు 50 కంటే ఎకువ ఈవెంట్లు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డేటా సైన్స్ క్వెస్ట్, ఫొటోగ్రఫీ క్లబ్ రీక్రియేటింగ్ ది మూమెంట్, క్విజ్ క్లబ్ సికాడా, కేబీసీ, తదితర ఈవెంట్లను ప్రదర్శించనున్నారు.