వరంగల్ : మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం సమీపంలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం ఆమె మ్యూజికల్ గార్డెన్‌ను సందర్శించి గార్డెన్లో కలియ తిరిగారు. ప్రస్తుతం మ్యూజికల్ గార్డెన్ బల్దియా అధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కౌన్సిల్‌తో తీర్మానం చేసిన నేపథ్యంలో ఆమె మ్యూజికల్ గార్డెన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని గార్డెన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకవస్తామని ఆమె అన్నారు.
వరంగల్ నగరంలో ప్రజలకు ఆహ్లదం అందించేలా మ్యూజికల్ గార్డెన్‌ను సుందరీకరిస్తామన్నారు. పిల్లల ఆట వస్తువులతో పాటు గార్డెనింగ్‌ను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.