టేకుమట్ల : బీడుబారిన తెలంగాణకు నీరును అందించి పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి, బూర్నపల్లి గ్రామాల్లోని రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో పాలకుల నిర్లక్ష్యం వల్ల దగాపడ్డ రైతుకు నేనున్న అనే ధైర్యన్ని ఇచ్చిన పాలకుడు మన సీఎం కేసీఆర్ అని అన్నారు.
ప్రతి శివరాత్రికి బూర్నపల్లిలో జరిగే గట్టు మల్లన్న జాతర విశిష్టతను సీఎం దృష్టికి తీసుకుపోగ, ఎండోమెంట్ అధికారులను పంపించారని, అధికారులు గుట్టపై గుడి నిర్మాణం కోసం సర్వే జరిపి నివేదిక ఇచ్చిన తర్వాత నిధులను మంజూరు చేయించి వచ్చే శివరాత్రి వరకు గుడి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అంగన్వాడీ సెంటర్, బడి, గ్రామ పంచాయతీ కార్యాలయం అన్ని ఒకే దగ్గర పురాతనమైన బిల్డింగ్‌లో ఉన్నాయని తెలిపారు. స్పందించిన ఆయన ఎవరైనా భూమి ఇస్తే నూతన భవనాలను మంజూరు చేయిస్తామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ కూర సురేందర్‌రెడ్డి, ఏవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు ప్రియంక మహజన్, చిట్యాల వసంత, చింతపల్లి విజయ, శ్రీనివాస్, ఎంపీటీసీలు గందం వజ్ర, పెరుమాండ్ల చంద్రకళ, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.