తొర్రూరు, ఆగస్టు 11 : భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ స్ఫూర్తితోనే నాడు కేసీఆర్ తెలంగాణను సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం 2కే రన్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ఆధ్వర్యంలో రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి సహకారంతో 75 మీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొర్రూరులోని అంబేదర్ సెంటర్లో అంబేదర్ విగ్రహానికి, గాంధీ సెంటర్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ఫ్రీడం 2కేరన్ను ప్రారంభించి జిల్లా పరిషత్ పాఠశాల వరకు అందరితో కలిసి మంత్రి రన్లో పాల్గొని ఉత్సాహపరిచారు. అనంతరం తొర్రూరు హైస్కూల్లో భారీ జాతీయ పతాకం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. త్రివర్ణ రంగులతో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియాన్ గ్యాస్ బెలూన్లను గాలిలోకి వదిలారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి ఆధ్వర్యంలో 2కే రన్లో పాల్గొని మొదటగా గమ్యానికి చేరుకున్న ఐదుగురికి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా సీఎం కేసీఆర్ గాంధీజీ స్ఫూర్తితో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ ఆశయాలకనుగుణంగా గ్రామీణ భారతంలోనే దేశ అభివృద్ధి ఉందని భావించిన కేసీఆర్ పల్లెప్రగతి వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
దేశంలో 20 అత్యున్నత ఆదర్శ గ్రామాలను ఎంపిక చేస్తే, అందులో 19 తెలంగాణవే ఉండడం ఇందుకు నిదర్శనమన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న లక్ష్యంతోనే వజ్రోత్సవాల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని శాంతియుత మార్గంలోనే దేనైన్నా సాధించవచ్చునని చెప్పారు. తెలంగాణ గాంధీజీగా పేరున్న సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని, ఆచరణను ఆదర్శంగా తీసుకుని నేటి యువత భవిష్యత్ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో ఎల్ రమేశ్, డీఎస్పీ వై రఘు, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పీ సోమేశ్వర్రావు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, సీఐ సత్యనారాయణ, ఎక్సైజ్ సీఐ రాజు, తహసీల్దార్ రాఘవరెడ్డి, కమిషనర్ గుండె బాబు, ఎస్సైలు సతీశ్, రాజు, రాంజీనాయక్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు, సేవా తరుణి, టీచర్స్ క్లబ్ ప్రతినిధులు, పలు యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 75 ఏళ్ల స్వతంత్య్ర భారత వేడుకల లోగోతో ముద్రించిన టీషర్ట్లను 200 మందికి క్లబ్ ఆర్సీ రేగూరి వెంకన్న, జడ్సీ ప్రతాపని వెంకటేశ్వర్లు, దామెర సరేశ్, అధ్యక్ష, కార్యదర్శులు ఎం వేణుగోపాల్, ఎన్ కృష్టమూర్తి, కోశాధికారి టీ రమేశ్, సీహెచ్ నవీన్ తదితరులు అందజేశారు. సేవా తరుణి ఆధ్వర్యంలో అధ్యక్షురాలు వీ దీప, డాక్టర్ ఎస్ నాగవాణి, ఎం రజిత, ఆర్ శ్రీదేవితోపాటు సభ్యులు కలిసి జ్ఞాపికలను మంత్రి దయాకర్‌రావు చేతులమీదుగా ఇప్పించారు. పీఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు భరతమాత వేషధారణలో అలరించగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పీ సోమేశ్వర్రావు కార్యక్రమంలో పాల్గొన్న వారికి బిస్కెట్లు, మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విప్లవ్‌రెడ్డి, సునీల్ తదితరులు పండ్లు పంపిణీ చేశారు.