రాయపర్తి, జూలై 24 : గొప్ప వాక్పటిమ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్ర పరిజ్ఞానం కలిగిన మంత్రి కేటీఆర్ యువతరానికి మార్గ నిర్దేశకుడిగా నిలుస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా వెంకటేశ్వరపల్లి గ్రామంలోని మినీ బృహత్ పల్లె ప్రకృతి వనంలో 11,500 మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎ కేసీఆర్‌కు తగ్గ తనయుడు కేటీఆర్ అని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహిస్తున్న పాత్ర ఎంతో అమూల్యమైందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, బంగారు తెలంగాణ నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా కేటీఆర్ పని చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, నాయకులు పూస మధు, గబ్బెట బాబు, ఎండీ నయీం, సర్పంచ్‌లు గూబ యాకమ్మ-ఎల్లయ్య, నలమాస సారయ్య, బానోత్ పద్మ-రవినాయక్, బానోత్ జగన్నాయక్, ఎంపీటీసీ భూక్యా గోవింద్‌నాయక్, గొట్టం ప్రతాప్‌రెడ్డి, మంద సునీత-యాకూబ్‌రెడ్డి, పొన్నం కుమారస్వామి, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శులు బత్తుల నర్సయ్య, గుగులోత్ అశోక్‌నాయక్, చల్లా అజిత్‌రెడ్డి, గారె నర్సయ్య, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, కోదాటి దయాకర్‌రావు, అయిత రాంచందర్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, మహ్మద్ అశ్రఫ్‌పాషా, సత్తూరి నాగరాజు, ఉబ్బని సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.