వరంగల్, జూలై22(నమస్తేతెలంగాణ) ;ఉపాధి పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. కేంద్రం నుంచి వచ్చే నిధుల వినియోగానికి ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. తద్వారా కూలీలకు ఉపాధి లభిస్తుండడంతో పాటు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. చెరువుల్లో పూడికతీత, ఫీడర్, ఫీల్డ్ చానళ్ల పునరుద్ధరణతో రైతులకు ప్రయోజనం కలుగుతున్నది. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. రాష్ర్టానికి ఉపాధి హామీ పథకం నిధుల్లో భారీగా కోత పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నది. ఇక్కడి కూలీల పొట్టకొట్టేందుకు పావులు కదుపుతోంది.
తనిఖీల పేరుతో అధికారులను కలవర పెడుతున్నది.
ప్రగతి పరుగులు..
ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున కూలీలకు పని కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ప్రగతి దిశగా పరుగులు పెట్టిస్తున్నది. భూగర్భ జలమట్టం పెరుగుదలకు చెరువుల్లో పూడిక మట్టి తీసి రైతుల వ్యవసాయ భూముల్లోకి తరలిస్తున్నది. ప్రభుత్వ, అటవీ భూముల్లో కందకాల తవ్వకం, వ్యవసా య భూముల్లో ఫాంపాండ్స్, చిన్న చెరువుల నిర్మాణం, మరమ్మతులూ చేప ట్టింది. పచ్చదనం పెంపునకు గ్రామాల్లో అవెన్యూ, మల్టీ లేయర్, బ్లాక్, కమ్యూనిటీ, ఇనిస్ట్యూషనల్ ప్లాంటేషన్ పనులు చేస్తున్నది. ప్రతి జీపీలో డంపింగ్‌యా ర్డు, వైకుంఠధామం నిర్మించింది. క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టింది. వీటి చుట్టూ మొక్కలు నాటుతున్నది.
ప్రతి క్లస్టర్లో ఒక రైతువేదికనూ నిర్మించింది. మరే రా ష్ట్రంలో లేని రీతిలో ఇక్కడ అభివృద్ధి జరుగుతుండడం చూసి ఉపాధి హామీ నిధు ల్లో కోత పెట్టేందుకు కేంద్రం కుతంత్రాలు చేస్తున్నది. పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని కుంటి సాకులు చెబుతూ విచార ణకు కేంద్ర బృందాలను పంపిస్తున్నది. ఇప్పటికే పలు జిల్లాలకు సెంట్రల్ టీమ్ లు చేరుకున్నాయి. ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు, ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టి కూలీల పొట్టకొట్టేందుకు చేస్తున్నట్లు తెలిసింది.
గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యం గా 2005-2006లో కేంద్రంలోని అప్పటి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట్లో వెనుకబడిన జిల్లాల్లో అమలైన ఈ పథకాన్ని క్రమేణా అన్ని జిల్లాలకు విస్తరించింది. దీని ద్వారా ఏటా ప్రతి జిల్లాలో పెద్ద సంఖ్యలో కూలీలు ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో వలసలకు బ్రేక్ పడింది. కూలీలకు చేతి నిండా పనికల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజోపకరమైన పనులు చేపడుతున్నది. దీంతో గ్రామాలు అభివృద్ధి బాటన పయనిస్తున్నాయి. ప్రగతికి కేరాఫ్‌గా మారుతున్నాయి.
లక్షల మందికి ఉపాధి..
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాకు ఏటా సుమారు రూ.100 కోట్లు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో జిల్లాలో ఏటా పెద్ద సంఖ్యలో కూలీలు ఉపాధి పొందుతున్నారు. చెన్నారావుపేట, దుగ్గొండి, గీసు గొండ, ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, వర్ధన్నపేట మండలాల్లో 1,23,632 కుటుంబాల్లోని 2,55,854 మంది ఉపాధి పని కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో పేర్లు నమో దు చేసుకున్నారు. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 54,734 కుటుంబాల్లోని 88,185 మంది ఉపాధి పనులు చేశారు. 20,41,841 పని దినాల టార్గెట్‌లో 20,35,904 పని దినాలు పూర్తయ్యాయి. సగటున ఒక పనిదినానికి రూ.203 కూలి పొందారు.
అధికారు లు ఇప్పటివరకు 68.09 కోట్లు ఖర్చు చేశా రు. ఇందులో అభివృద్ది పనులకు సంబంధించిన మెటీరియల్ కోసం రూ.39.25 కోట్లు, కూలీలకు రూ.28.83 కోట్లు చెల్లించారు. కూలి పని కోసం పేర్లు నమోదు చేసుకున్న అందరికీ మార్చి నెలాఖరు వరకు పని కల్పించేలా అధికారులు ప్రణాళిక రూపొందించా రు. చేతి నిండా పని దొరుకుతుండడంతో గతంలో గ్రామాలను వదిలి పట్టణాలకు వల స వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. జాబ్‌కార్డు పొంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. కరోనా సమయంలో హైదరాబాద్ తదితర మహా నగరాల నుంచి గ్రామాలకు చేరుకున్న వారిలో ఎక్కువ మంది జాబ్‌కార్డులు పొంది ఉపాధి హామీ పనులకు వెళ్తూ ఇక్కడే ఉండిపోయారు.