వెంకటాపురం (నూగూరు)/ కాటారం/ ఏటూరునాగారం/ మంగపేట/ వాజేడు/ కన్నాయిగూడెం, జూలై 22 : ఇటీవల కురిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో ము లుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నిరాశ్రయులైన వారికి పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు అందజేశాయి. వెంకటాపురం నూగూరు మండలం టేకులబోరులో శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పీర్లకృష్ణ బాబు ఆధ్వర్యంలో 55 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పేడు వీరాపురం సర్పంచ్ తుర్స సూరిబాబు, గ్రామస్తులు గడ్డంవివేక్, పాల్గొన్నారు. కాటారం మండల కేంద్రానికి చెందిన గజ్జెల మల్లయ్య ఇల్లు కూలిపోగా టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నియోజక వర్గ అధ్యక్షుడు పంతకాని సడవలి బాధితుడికి పరదా అందజేశారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరులో 120 కుటుంబాలకు వవవాసీ కల్యాణ్ పరిషత్, సేవా భారతి ఆధ్వర్యంలో సరకులను పంపిణీ చేశారు.
సంస్థ జిల్లా ప్రచారక్ నవీన్‌కుమార్, సభ్యు లు ఆంజనేయులు, శంకర్, నూనె రాజు, కుదురుపాక ప్రవీణ్, జిట్ట ఈశ్వర్, ఇర్సవడ్ల వైకుంఠం, ఉప సర్పంచ్ అల్లంల చంటి, ఎంపీటీసీ జాడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మంగపేట మండలం అకినేపల్లిమల్లారం, బోరునర్సాపురం గోదావరి వరద ముంపు కుటుంబాలతో పాటు, నర్సింహసాగర్ లోతట్టు ప్రాంత కుటుంబాలకు శుక్రవారం సాయంత్రం 5కిలోల కంది పప్పు, 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. మంగపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేశ్, అకినేపల్లిమల్లారం మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వత్సవాయి శ్రీధరవర్మ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, డీటీ సురేశ్‌బాబు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ జిల్లా విజిలెన్స్, మానిటరిం గ్ సభ్యులు రాజమల్ల సుకుమార్ పాల్గొన్నారు.
వాజేడు మండలం మొరుమురు కాలనీ గ్రామానికి చెందిన కుటుంబాలకు ప్రగళ్లపల్లిలో శుక్రవారం జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి 25 కిలోల బియ్యం, ఐదు కిలోల కంది పప్పు పంపిణీ చేశారు. ఎంపీపీ శ్యామల శారద, సర్పంచులు పూ సం నరేశ్‌కుమార్, కోరం సాంబయ్య, ఉప సర్పంచ్ గౌరరాపు కోటేశ్వర్రావు, సేల్స్‌మెన్ బాలాజీ పాల్గొన్నారు. అలాగే గుమ్మడిదొడ్డి, టేకులగూడెం, కృష్ణాపురం, చండ్రుపట్ల, కడెకల్, చెరుకూరు గ్రామాల్లో శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పర్యటించారు. బాధిత కుటుంబాలకు సరుకులను పంపిణీ చేశారు. నాయబ్ తహసీల్దార్ సయ్యద్ సర్వర్, గిర్దావర్ రాజు, సర్పంచులు ఇర్ప సమ్మ క్క, వాసం కృష్ణవేణి, పునెం నాగచంద్ర. పాయం జయలక్ష్మీ పాల్గొన్నారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లిలో మండల ప్రత్యేక అధికారి, డీపీ వో వెంకయ్య, తహసీల్దార్ వీరస్వామి, ఎంపీడీవో ఫణిచంద్ర, ఎంపీవో సాజిదాభేగం, ఎంపీపీ జనగాం సమ్మక్క, వైస్ ఎంపీపీ భాస్కర్ గ్రామస్తులకు సరుకులు అందిచారు.