హనుమకొండ, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి సామాన్య ప్రజల నడ్డివిరు స్తోందని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హను మకొండలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మా ట్లాడారు. పుట్టిన బిడ్డ పాల నుంచి మొదలుకొని శ్మశానవాటికకు వెళ్లే వరకు కేంద్ర ప్రభుత్వం పన్ను వేస్తోందని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. పెంచిన డీజిల్, పెట్రోల ధరల ప్రభావం రైతాంగం, మధ్య తరగతి ప్రజలపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా వ్యవసాయ రంగంపై అధిక ప్రభావం చూపుతోందన్నారు. వరదల సందర్బంగా బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాలకు రూ. కోట్లు ఇస్తున్న కేంద్రం తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంపై మోదీ ప్ర భుత్వం ఎందుకు వివక్ష చూపుతోంది, మేము ఈ దేశంలో లేమా? అని అరూరి ప్రశ్నించారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో దిగుబడి ఎక్కువగా వచ్చినా ధాన్యం కొను గోలు చేయలేని దుర్మార్గమైనది మోదీ ప్రభుత్వమన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మిల్లులోని ధాన్యం తడిసి మొలకెత్తుతుందని, కార్మికులు, ఉద్యోగుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తా రు. కేంద్రానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పెంచిన జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
కేంద్రం నిర్ణయంతో రైస్ ఇండస్ట్రీ సంక్షోభం
కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో రైస్ ఇండస్ట్రీ సంక్షోభంలో కూరుకుపోనుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ సీఎంఆర్ సేకరణ నిలిపివేయడంతో రైస్ ఇండస్ట్రీ అంతా రోడ్లపైకి వచ్చిందన్నారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత, తప్పుడు నిర్ణయాలతో గత 48 రోజులుగా రాష్ట్రంలోని 3600 రైస్ మిల్లులు మూతపడ్డాయన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై ఎఫ్‌సీఐ తప్పుడు కేసులు పెడుతున్నదని ఆరోపించారు. మిల్లులు మూతపడడంతో అందులో ఉన్న ధాన్యం గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసి మొలకెత్తాయన్నారు.
యాసంగి వరి పంటను సాగు చేయాలని రైతులను మరోసారి మోసం చేసిన బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా సీఎం కేసీఆర్ రూ. 3వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ రాష్ట్ర రైతాంగం నష్ట పోవద్దనే ఉద్దేశంతో మద్దుతు ధరతో కొనుగోలు చేశారన్నారు. వంద శాతం ప్రొక్యూర్మెంట్ చేసిన ప్రభుత్వం ఒక తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైస్ ఇండస్ట్రీకి అండగా నిలువడంతోపాటు కాపాడుకుంటుందన్నారు. రైస్ మిల్లర్లను, తెలంగాణ రైతాంగాన్ని అవమాన పరిచేలా ఎంపీ అరవింద్ మాట్లాడాడని, ఆయన వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు ఎఫ్‌సీఐ అధికారులు రైస్ మిల్లుల వద్దకు వెళ్లి తనిఖీలు చేసిన దాఖ లాలు లేవని అన్నారు. రైస్ మిల్లులపై దాడులు చేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారని మండి పడ్డారు. రాజకీ య కుట్రతోనే బీజేపీ ప్రభుత్వం మిల్లులపై దాడులు చేస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్‌సీఐ ద్వారా సీఎంఆర్ సేకరణ ప్రారంభించాలని పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, కార్పొరేటర్ సిరంగి సునీల్, మైనార్టీ నాయకుడు నయీమొద్దీన్ పాల్గొన్నారు.