హనుమకొండ, జూలై 20: కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఎఫ్‌సీఐ సీఎంఆర్ బియ్యం సేకరణను నిలిపివేయడంతో రైస్ ఇండస్ట్రీ అంతా రోడ్డుపైకి వచ్చింది. మిల్లు యజమానులు, అందులో పనిచేసే ఉద్యోగులు, హమాలీలు, కార్మికులు ఆందోళనకు చేశారు. వెంటనే బియ్యం సేకరణ ప్రారంభించాలని, జరిగిన నష్టాన్ని పూడ్చాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు నుంచి వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యా లీగా వచ్చి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపా టు వెంటనే బియ్యం సేకరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గత 48 రోజుల నుంచి ఎఫ్‌సీఐ సీఎంఆర్ బియ్యం సేకరణను నిలిపి వేసిందన్నారు. సేకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పంతాలకు పోయి అనేక ఇబ్బందులు స్పష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం సేకరణ నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్ల వద్ద 2021- 22 వానా కాలానికి సంబంధించి 30 లక్షల టన్నులు, 2021- 22 యాసంగికి సంబంధించి సుమారు 50 లక్షల టన్నుల నిల్వలు పేరుకుపోయాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం మిల్లర్లకు సంబంధం లేని విషయాలను మిల్లింగ్ పరిశ్రమకు అనుసంధానం చేసి 48 రోజుల నుంచి ఆకస్మికంగా బియ్యం సేకరణ నిలిపివేసిందన్నారు. ఈ విషయంలో విజ్ఞాపనలు చేసినప్పటకీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మిల్లింగ్ పరిశ్రమ నిలిచిపోయిందని తెలిపారు. దీంతో తెలంగాణలోని సుమారు 1000 బాయిల్డ్, 2500 రా రైస్ మిల్లులు మూతపడ్డాయన్నారు. దీంతో రైస్ మిల్లింగ్ పరిశ్రమ పూర్తిగా ఆగిపోయి కార్మికులకు పని లేకుండా పోయిందన్నారు.
అంతేకకా ఇటీవల కురిసిన భారీ వర్షాల కు ధాన్యం మొత్తం తడిసిపోయి మొలకలు వచ్చి పాడై పోయే పరిస్థితిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితు ల్లో బియ్యం సేకరణ తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు వారు పేర్కొన్నారు. సీఎంఆర్ సేకరణ నిలిపివేయడంతో వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ స్టోరేజీలో ఉన్న సుమారు పది లక్షల టన్నల ధాన్యం తడిసిపోయిందని, ఈ నష్టానికి మిల్లర్లను బాధ్యులు చేయవద్దని డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వానికి ఇచ్చిన గ్యారంటీలను కూడా ఈ రోజు నుంచి ఉపసంహ రించుకుటున్నట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గోనెల రవీందర్, కోశాధికారి తకళ్ళపల్లి యుగంధర్, జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా రమేశ్, సింగిరికొండ మాధవ శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవునూరి అంజయ్య, సలహాదారులు ప్రభాకర్‌రావు, మాదరపు చంద్రశేఖర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు, రవి, సతీశ్, నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు ఇరుకు కోటేశ్వరరావు, కోశాధికారి భూపాల్‌రావు, సభ్యు లు శ్రీనివాస్, మల్లయ్య, రమేశ్, ఇరుకుల్లా రమేశ్, మల్లేశం, ప్రభాకర్, కార్మిక సంఘాల నాయకులు మోడెం మల్లేశం, రైతు సంఘాల నాయకులు మోతె జైపాల్‌రెడ్డి, చందర్రావు, కార్మికులు, హమాలీలు, ఉద్యోగులు మిల్లర్లు కలిపి రెండు వేల మంది వరకు పాల్గొన్నారు.
వరంగల్ అదనపు కలెక్టర్‌కు వినతి
వరంగల్ చౌరస్తా: వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సమావేశం నిర్వహించి అదనపు కలెక్టర్ శ్రీవత్స కోటను పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కోరారు. గడిచిన 45 రోజులుగా ఫెడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), సివిల్ సప్లయ్ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన బియ్యం సేకరణ జరగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా 2021-22కు సంబంధించిన సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 2021-22 యాసంగి సీజన్‌కు సంబంధించిన సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు రైస్ మిల్లల వద్ద పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.