నర్సంపేట/వరంగల్‌చౌరస్తా, జూలై 20: పాల ఉత్పత్తులపై జీఎస్టీని నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది హాజరై మాట్లాడుతూ పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం వల్ల పాడి రైతులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఇప్పటికే కేంద్రం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుంటి కిషన్, నల్లా మనోహర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నామాల సత్యనారాయణ, మండల శ్రీనివాస్, ఎంవీ రామారావు, దార్ల రమాదేవి, సారంగపాణి, వడ్నాల వంశీకృష్ణ, గంప రాజేశ్వర్‌గౌడ్, పాషా, మచ్చిక నర్సయ్యగౌడ్, కొంకీస కుమార్‌గౌడ్, బీరం నాగిరెడ్డి పాల్గొన్నారు. అలాగే, వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ 27వ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్‌కుమార్ మాట్లాడుతూ పాలు, పెరుగు, ఉప్పు, పప్పు, చెక్కర, పిండి పదార్థాలపై పన్ను భారాన్ని మోపుతూ కేంద్రం పేదల నడ్డివిరుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో 27వ డివిజర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సిందే..
రాయపర్తి/పోచమ్మమైదాన్/నెక్కొండ/పర్వతగిరి: ప్రజావ్యతిరేక విధానలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రజాగ్రహానికి మూల్యం చెల్లించుకోక తప్పదని టీఆర్ఎస్ రాయపర్తి మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ హెచ్చరించారు. నిత్యావసరాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతృత్వంలో మండలకేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఖాళీ పాల డబ్బాలను ప్రదర్శిస్తూ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, నాయకులు పూస మధు, గారె నర్సయ్య, అయిత రాంచందర్, బిల్ల సుభాష్‌రెడ్డి, ఎండీ నయీం, ఉస్మాన్, అక్బర్, మచ్చ సత్యం, అయిత కుమార్, ఉండాడి సతీశ్‌కుమార్, గూడెల్లి శ్రీనివాస్, బానోత్ జగన్నాయక్, కోదాటి దయాకర్‌రావు, బానోత్ భద్రూనాయక్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్‌యాదవ్, మహ్మద్ అశ్రఫ్‌పాషా, సత్తూరి నాగరాజు, నాగపురి సోమయ్య, చెడుపాక కుమారస్వామి పాల్గొన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీని వ్యతిరేకిస్తూ వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో దేశాయిపేటరోడ్డులో ఆందోళన చేపట్టారు.
డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, కాశెట్టి వేణు పాల్గొన్నారు. 21వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో నిరసన తెలిపారు. 23వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ ఆధ్వర్యంలో గోపాలస్వామి గుడి సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. డీసీసీబీ డైరెక్టర్ యెలుగం రవిరాజ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ 22వ డివిజన్ ఇన్చార్జి మావురుపు గీత విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో బ్యాంకు కాలనీ-1లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నెక్కొండలో సీపీఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు నిత్యావసర వస్తువులు, పెట్రో, పాల ఉత్పత్తులపై ట్యాక్స్‌లు వేయడం వల్ల ధరలు పెరిగి సామాన్యుల జీవితం అథోగతి పాలవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు దేవపాల, ముడుసు లక్ష్మి, సింగం వెంకటలక్ష్మి, మాంకాల కిషన్, కూస వెంకన్న, చెరుకు వెంకన్న, సూరయ్య, రేణుక, అశోక్ ఉన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీని నిరసిస్తూ టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిరసన తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్, నాయకులు పాల్గొన్నారు.