కాశీబుగ్గ, జూలై19: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం రికార్డు స్థాయిలో మిర్చి ధర పలికింది. క్వింటాకు రూ.32వేల 500తో వ్యాపారులు కొనుగోలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన మాధ వరావు మార్కెట్‌కు 20 బస్తాల వండర్‌హాట్ రకం మిర్చి తీసుకువచ్చాడు. లక్ష్మీసాయి అడ్తి కమీషన్ ద్వారా గాయత్రి ఎంటర్ ప్రైజెస్ కరీదు వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలి పారు. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన టీ పార్వతి 19 బస్తాల 341 రకం మిర్చి తీసుకువచ్చింది. ఏకశిలా అడ్తి ద్వారా నందిని ఎంటర్ ప్రైజెస్ కరీదు వ్యాపా రి కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం 341 రకం మిర్చి అత్య ధికంగా క్వింటాకు రూ.21వేలు పలికినట్లు తెలిపారు. ఈ సీజన్లో రూ.20వేల నుంచి రూ. 26వేల వరకు ధరలు పలికాయి. అలాగే వంటర్హాట్ రకం మిర్చి ఈ సీజన్లో క్వింటాకు రూ.25వేలు పలికినట్లు అధికారులు తెలిపారు. కోల్డుస్టోరేజీల్లో రైతులు నిల్వ చేసిన మిర్చికి మంగళవారం అత్యధికంగా ధర పలికిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేశారు. నాణ్యతగల మిర్చిని తీసుకువస్తే తప్ప కుండా గిట్టుబాటు ధరలు పొందవచ్చని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.