కరీమాబాద్, జూలై 19: వరంగల్ రైల్వేస్టేషన్లో మంగళవారం గూడ్స్ రైలింజన్ పట్టాలు తప్పింది. ఇతర ప్రాంతాల నుంచి వరంగల్‌కు సరుకులను తీసుకువచ్చిన గూడ్స్ రైలు బోగీలను స్టేషన్లో నిలిపి తిరిగి వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పి ఇంజిన్ చక్రం కిందకు దిగబడింది. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. అప్రమత్తమైన రైల్వే శాఖ అధికారులు కాజీపేట నుంచి సిబ్బందిని పిలిపించి మరమ్మతులను చేపట్టి గూడ్స్ రైలింజిన్‌ను పట్టాలపైకి ఎక్కించారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరుగలేదు.