చెన్నారావుపేట/నర్సంపేటరూరల్, జూలై 18: సర్కారు బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చెన్నారావుపేట ఎంఈవో రత్నమాల, ఎంపీపీ విజేందర్ సూచించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం మండలకేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో 70 శాతం పాఠ్యపుస్తకాలను ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీచర్లు విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సరళ, పాపమ్మ, ఫ్లోరెన్స్, రవి, భద్రయ్య, సురేందర్, కొమురయ్య, జ్యోతి, ఇంద్రయ్య, ఎమ్మార్సీ సిబ్బంది, సీఆర్పీలు సంపత్, అశోక్, యాదగిరి, శ్రీనివాస్, బాలు, స్వామి, శిల్ప, హేమలత పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట ఎమ్మార్సీలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఎంఈవో రత్నమాల పాఠ్యపుస్తకాలు అందించారు. నర్సంపేట మండలానికి 18 వేల పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ గుడిపూడి రాంచందర్‌రావు, హెచ్ఎంలు గోపాల్‌రెడ్డి, ఎస్కే సర్దార్, వెంకటేశ్వర్లు, రవి, సీఆర్పీలు మర్ధ శ్రీనివాస్, రవీందర్, భరత్, ఐఈఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలి
నల్లబెల్లి/దుగ్గొండి: విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలని ఎంఈవో చదువుల సత్యనారాయణ సూచించారు. శనిగరం ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ను ఎంఈవో సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. అనంతరం మండలకేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం విద్యార్థుల హాజరు శాతం నమోదు కావాలని సూచించారు. పాఠశాలల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు సదాశివుడు, భిక్షపతి పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఎంఈవో చదువుల సత్యనారాయణ పుస్తకాలు పంపిణీ చేశారు.
కేజీబీవీ ప్రత్యేకాధికారి మంజుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే విద్యపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. బాలురకు దీటుగా బాలికలు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేసిన ఎస్వో మంజుల, టీచర్లను ఎంఈవో అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమ, సుభాషిణి, అనూష, భారతి, సరస్వతి, సంధ్య, లావణ్య, స్రవంతి, కవిత, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
విద్యారంగ అభివృద్ధికి చర్యలు
రాయపర్తి: విద్యార్థుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పెర్కవేడు సర్పంచ్ చిన్నాల తారాశ్రీ రాజబాబు అన్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం గారె కృష్ణమూర్తి, ఎస్ఎంసీ చైర్మన్ పరీదుల సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.