ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు పత్రాల అందజేత
ఖిలావరంగల్, జూలై 15 : ప్రజల సహకారం ఉంటే నే అభివృద్ధి సాధ్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో రోడ్డు విస్తరణలో భాగంగా 17వ డివిజన్లో ఇళ్లను కోల్పోతున్న బాధితులకు రెండు పడక గదుల ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విలీన గ్రామాల అభివృద్ధి, రోడ్డు విస్తరణకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో నియోజకవ వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇళ్లు కోల్పోతున్న 121 మందికి మంజూరు పత్రాలు అందజేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే అహర్నిషలు కృషి చేస్తున్నదన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు, డివిజన్ అధ్యక్షుడు దామోదర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15, 17వ డివిజన్లలో రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన వారికి శుక్రవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించారని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంతో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు.
రాష్ర్టాభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైన వారందరూ నిర్మాణ పనులు మొదలు పెట్టుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, గాదె బాబు, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ బాలయ్య, నాయకులు బాబురావు, లవ్ కాజు, నవీన్, ముక్కెర సతీశ్, పూర్ణచందర్, తరిగల ప్రసాద్, రామరావు తదితరులు పాల్గొన్నారు.