మట్టెవాడ, జూలై 15 : హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలు నడుపడం ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అన్నారు. వరంగల్ ఎంజీఎం సెంటర్లో శుక్రవారం హెల్మెట్, నంబర్ ప్లేట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతున్న వారికి కౌన్సెలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ధ్రువీకరణ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రావెల్ల రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.
‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో ఒకరికి జైలు..
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష పడినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపారు. తాగి వాహనం నడిపిన 19 మందిని శుక్రవారం వరంగల్ రెండో తరగతి మెజిస్ట్రేట్ రమేశ్‌బాబు ఎదుట హాజరుపర్చగా, బంకా వినోద్‌కుమార్‌కు రెండు రోజుల జైలు శిక్ష విధించారన్నారు. అతడిని పరకాల సబ్‌జైలుకు తరలించామని, మరో 18మందికి రూ.42,500 జరిమానా వేసినట్లు తెలిపారు.