నర్సంపేట/వర్ధన్నపేట/నర్సంపేటరూరల్/సంగెం/వరంగల్‌చౌరస్తా, జూలై 10: జిల్లావ్యాప్తంగా బక్రీద్‌ను ముస్లింలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో నర్సంపేటలో ముస్లింలు మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మహ్మద్ నబీ, ఉపాధ్యక్షుడు ఇంత్యాజ్, షేక్నయాబ్ రసూల్, షేక్కాసీం, అబ్దుల్ ఖాదర్, కార్యదర్శి అబీబ్, జాయింట్ సెక్రటరీ అబ్దుల్ అజీముద్దీన్, కోశాధికారి అయూబ్‌ఖాన్ పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలంలోని ముస్లింలు బక్రీద్ వేడుకలను జరుపుకున్నారు. మండలకేంద్రంలోని జమా మసీదుతోపాటు గ్రామాల్లోని ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో బక్రీద్ వేడుకలు జరిగాయి.
పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ముస్లిం ఖుర్బానీ, సేమియాలు చేసి ఇతరులు, బంధుమిత్రులకు పంపిణీ చేశారు. పాతముగ్దుంపురం మసీదులో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఎండీ అయ్యూం, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎంఏ గఫార్, భాషు, అంకూస్, అక్తర్, అక్బర్, ముత్తోజిపేటలో మండల కో ఆప్షన్ మెంబర్ చాంద్‌పాషా, మహబూబ్‌పాషా, యాకూబ్‌పాషా, రఫీ, రహీం, అజారుద్దీన్, అక్బర్‌పాషా, అఖీంపాషా, రజాక్, సాదిక్‌పాషా, చంద్‌పాషా, అయ్యూం పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంగెం మండలంలో ముస్లింలు బక్రీద్ పర్వదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, ఇస్మాయిల్, ఖాజాపాషా, రబ్బాని, ఆజ్గర్, హైమద్, రియాజ్, వాహిద్, పాషా, జాంగీర్, ఇమామ్ పాల్గొన్నారు. యాకుబ్పురలోని ప్రార్థన మందిరంలో నిర్వహించిన వేడుకల్లో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బంధుమిత్రులకు ‘ఖుర్బానీ’ పంపకం
రాయపర్తి/పర్వతగిరి: ముస్లింల పవిత్ర పర్వదినం ఈద్-ఉల్-ఆదా (బక్రీద్) వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాల్లో ప్రత్యేక నమాజులు చేయాల్సి ఉండగా, ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో స్థానిక మసీదుల్లోనే ముస్లిం ప్రార్థనలు చేశారు. ఈద్ నమాజు ముగిసిన తర్వాత పరస్పరం అలయ్ బలయ్ తీసుకుంటూ ఈద్‌ముబారక్ తెలుపుకున్నారు. అనంతరం త్యాగనీరతికి ప్రతీకగా నిలిచే ఖుర్బానీ నేపథ్యంలో ముస్లింలు జంతుబలులు నిర్వహించి బంధుమిత్రులకు మాంసం పంపిణీ చేశారు.
గ్రామాల శివారుల్లోని ఖబ్రస్థాన్‌లకు చేరుకున్న ముస్లింలు పూర్వీకుల సమాధులను సందర్శించి స్మరించుకున్నారు. సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో స్థానిక మసీద్-ఏ-నూర్ సదర్సాహెబ్ లాయఖ్ అలీ, మసీద్-ఏ-ఆలంగీర్ సదర్సాహెబ్ నయీం, మతపెద్దలు బాషామియా, గుంషావళి, అక్బర్, రఫీ, హుస్సేన్, యాకూబ్‌పాషా, సలీం, అస్గర్ అలీ, యూసూఫ్, చాంద్‌పాషా, జబ్బార్, షకీల్, మన్నన్, లతీఫ్, షరీఫ్, సత్తార్, నాసర్, అమ్జద్‌పాషా, రజాక్పాషా, రహీమొద్దీన్, మైపాషా, మన్సూర్, వసీం, యాసిన్, సల్మాన్, చాంద్‌పాషా, ఉమ్మర్, అఫ్రోజ్‌ఖాన్, మైమూద్పాషా, బషీర్, సోహెల్ పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని గ్రామాల్లో ముస్లింలు బక్రీద్ వేడుకలను జరుపుకున్నారు. అన్నారం షరీఫ్, కొంకపాక, సోమారం, వడ్లకొండ, ఏనుగల్, చింతనెక్కొండ, కల్లెడ, పర్వతగిరిలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రత్యేకతను చాటిన ఆదివారం
పోచమ్మమైదాన్/గీసుగొండ: పోచమ్మమైదాన్ ప్రాంతంలోని ముస్లింలు ఈద్గాలు, మసీదుల వద్ద నమాజ్ చేసి ఈద్‌ముబారక్ చెప్పుకున్నారు. వర్షం కారణంగా చాలామంది మసీదుల్లోనే ప్రార్థనలు చేశారు. కాగా, ఈ ఆదివారం ఒకేరోజు తొలి ఏకాదశిని పురస్కరించుకొని హిందువులు, బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లింలు, సన్డే సందర్భంగా క్రైస్తవులు తమ సంప్రదాయాల ప్రకారం పూజలు, నమాజ్‌లు, ప్రార్థనలు చేయడంతో జూలై 10వ తేదీ ప్రత్యేకతను చాటింది. దీంతో మతసామరస్యం వెల్లివిరిసింది. గీసుగొండ మండలవ్యాప్తంగా ముస్లింలు మసీదులు, ఈద్గాలకు వెళ్లి అల్లాను స్మరించుకొని నమాజ్ చేశారు. అనంతరం ఖురాన్‌ను పఠించారు.