రాయపర్తి, జూన్ 27 : మండలంలోని సన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జయరాంతండా(ఎస్), బాల్నాయక్తండాకు చెందిన సుమా రు 60 మంది రైతులు సోమవారం ఆందోళన చేశా రు. గ్రామంలో ఇటీవల ఇందిరాక్రాంతి పథం-మహిళా స్వయం సహాయక సంఘాల నేతృత్వంలో ని ర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలపై బాధిత రైతుల ఫిర్యాదు డీపీఎం భ వాని, సుధాకర్, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్ గ్రా మంలో విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు జీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స న్నూరు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ బస్తా ఒక్కంటికి 41.30కిలోలకు బదులు 42.50కిలోల చొప్పు న కాంటాలు వేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఒక్కో రై తుకు వేలల్లో నష్టం వాటిల్లుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 39 లారీల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ని ర్వాహకులు ఒక్కో లారీలో సుమారు 50 నుంచి 60 క్వింటాళ్ల చొప్పున ధాన్యం కోతకు గురైందని అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయమై తాము ఈ నెల 23న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కాగా, విచారణ అధికారులను ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, ఐకేపీ అధికారులు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం డీపీఎం భవాని మాట్లాడుతూ.. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బాధిత రైతులు బుర్క యాకయ్య, భూక్యా కిషన్‌నాయక్, సురేశ్, యాకూబ్, లక్పతి, పాండ్యానాయక్, నరేశ్, సూర్య, శ్రీనివాస్, రమేశ్, శారద, పద్మ, బుజ్జి, జిమ్మి, వెంకన్న, సంపత్ పాల్గొన్నారు.