దుగ్గొండి, జున్ 27 : ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదివి రేపటి బావిభారత నిర్మాతలుగా ఎదుగాలని దుగ్గొండి మం డల పరిషత్ అధ్యక్షుడు కాట్ల కోమలాభద్రయ్య అన్నారు. సోమవా రం దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వాసవీ క్లబ్ పోర్ట్ వరంగల్ వారి ఆ ధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగ్స్ అందించగా దుగ్గొండి మండల పరిషత్ అధ్యక్షుడు కాట్ల కోమలాభద్రయ్య విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ కోమలా వి ద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదవితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో వా సవీ క్లబ్ పోర్ట్ వరంగల్ అధ్యక్షుడు గంగిశెట్టి హరినాథ్, కార్యదర్శి నాగేంద్రబాబు, రవికుమార్, రవీందర్, ఆత్మకూరు హెమంత్, సర్పంచ్ తిరుపతిరెడ్డి, పీఆర్టీయూ మండలాద్యక్షుడు పరుపాటి సుదాకర్‌రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు అనంతుల కుమారస్వామి, ఎస్ఎంసీ చైర్మన్ రామనాథం, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు బీ నాగేశ్వరాచారి, ఉపాధ్యాయులు ఈదుల వీరస్వామి, రమాదేవి, శ్రీనివాస్, సారయ్య, రఘుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.