కరీమాబాద్, జూన్ 15: రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ బీరన్నకుంటలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్పొరేటర్ మరుపల్ల రవి అధ్యక్షతన బుధవారం మనబస్తీ-మనబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నన్నపునేని హాజరై మాట్లాడుతూ మనబస్తీ-మనబడితో సర్కారు బడులకు మహర్దశ రానుందన్నారు. సీఎం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలనే సంకల్పంతో పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. వసతుల కల్పనతోపాటు ఉత్తమ విద్యనందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో ఎమ్మెల్యే సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయ్‌కుమార్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్‌కుమార్, నాయకుడు వొగిలిశెట్టి అనిల్‌కుమార్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి కోసమే ‘పట్టణ ప్రగతి’
నగరాభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 40వ డివిజన్లో బుధవారం ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డివిజన్లో గుర్తించిన సమస్యలను అధికారులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మరుపల్ల రవి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యానికి పెద్దపీట
గిర్మాజీపేట: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. శివనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో 39వ డివిజన్ ఏకశిలానగర్‌కు చెందిన పాలకుర్తి శైలజకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 2.50 లక్షల చెక్కు ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశా రు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అం దించేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.