కరీమాబాద్, జూన్ 15 : పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందజేయాలని టీఎస్ఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీపీ అభిలాషా బిస్త్ అన్నారు. మామునూరు 4వ బెటాలియన్‌లోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలను బుధవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా మూతపడిన పాఠశాలను తెరవడం అభినందనీయమన్నారు. భావితరాలకు ఉజ్వల భవిష్యత్ అందజేయాలన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సిబ్బంది పని చేయాలన్నారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీ బెటాలియన్ డీఐజీ సిద్దికి, కమాండెంట్లు శివప్రసాద్‌రెడ్డి, చటర్జీ, పీటీసీ ప్రిన్సిపాల్ పూజ, అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.