మడికొండ, జూన్ 15 : గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్, మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 504 కిలోల గంజాయితోపాటు రెండు కార్లు, 7 మొబైల్ ఫో న్లను స్వాధీనం చేసుకున్నారు. మడికొండ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా మారేపల్లి గ్రామానికి చెందిన బేగరి సందీప్‌కుమార్ తన కారును సెల్ఫ్ డ్రైవింగ్‌కు కిరాయికి ఇస్తూ జీవనం సాగిస్తుంటాడు.
మహారాష్ట్రకు చెందిన నవనాథ్ పలుమార్లు కారును కి రాయికి తీసుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నవనాథ్ మార్చి 23న సందీప్‌కు ఫోన్ చేసి, ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి రవా ణా చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పాడు. లక్ష రూపాయలు ఇవ్వడంతో సందీప్ ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేశాడు. అలాగే, జూ న్ 12న నవనాథ్ నుంచి సందీప్‌కు మళ్లీ కాల్ వచ్చిం ది. ఈసారి సందీప్ రూ.2 లక్షలు తీసుకుని తన స్నేహితులు మెదక్ జిల్లా పోచారానికి చెందిన పల్లె వినోద్ కుమార్, మరిపల్లి గ్రామానికి చెందిన పోచారం ధన్‌రాజ్, భీమ్రా గ్రామానికి చెందిన సర్కారు రాహుల్, రంగారెడ్డి జిల్లా రాయగోడుకు చెందిన అర్పు విశాల్, మారెపల్లికి చెందిన పోచారం శివరాజ్‌ను కలిసి గంజా యి రవాణా గురించి వివరించాడు.
అందరూ కలిసి అదేరోజు రెండు కార్లలో ఒడిశాలోని కలిమెలకు చేరుకున్నారు. అక్కడ సత్తిబాబు అనే వ్యక్తిని కలిసి రెండు కార్లను అప్పగిస్తారు. దీంతో 504 కిలోల గంజాయిని బస్తాల్లో ప్యాక్ చేసుకుని రెండు కార్లలో వేసుకుని 14న తెల్లవారుజామున మహారాష్ట్రలోని తుల్జాపూర్‌కు వ యా ఏటూరునాగారం మీదుగా బయలుదేరారు. ఈ క్రమంలో రింగ్‌రోడ్డుపై మంగళవారం సాయంత్రం టేకులగూడెం క్రాస్ వద్ద టాస్క్‌ఫోర్స్, మడికొండ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఆరుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గంజాయి రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 504 కిలోల గంజాయి, మహేంద్ర ఎస్యూవీ, హోండా వెర్నా కార్లు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.52.40 లక్షలు ఉంటుందని చెప్పారు. కాగా, కొనుగోలు చేసే నవనాథ్, విక్రయించే సత్తిబాబు పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు. పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్, మడికొండ పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాపల్లి సంతో ష్, మడికొండ ఇన్స్పెక్టర్ మంతెన రవికుమార్, ఎస్సై నర్సింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.