సుబేదారి, జూన్ 15 : కల్లీ మిరప పొడి బస్తాలను రవాణా చేస్తున్న లారీని టా స్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ కథనం ప్రకారం.. హనుమకొండ కాకతీయ కాలనీకి చెందిన కంభంపాటి శ్రీధర్ మిర్చి తొడిమలు, వడ్ల తౌడుతో కల్తీ మిరప పొడిని తయారు చేసి ఎనుమాముల మార్కెట్ సమీపంలోని మల్లేశ్వర కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశాడు. రూ.10 లక్షల విలువైన 550 బస్తాలను లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్తో తనిఖీలు చేయగా కల్తీ పౌడర్‌గా నిర్ధారణ అయింది. దీన్ని ధనియాల పౌడర్‌లో కలిపి చిల్లీ పౌడర్‌గా విక్రయిస్తారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. కేసులో ప్రతిభ చాటిన టాస్క్‌ఫోర్స్ సీఐలు సంతోష్, శ్రీనివాస్‌జీ, ఎస్సై లవన్‌కుమార్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.