సంగెం, జూన్ 15 : ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకునేందుకు అదనపు కలెక్టర్ హరిసింగ్ మండలంలోని మొండ్రాయిలో రా త్రి 11గంటలకు పర్యటించారు. గ్రామంలో వీ ధి లైట్లు లేకపోవడాన్ని గమనించి ఎందుకు ఏ ర్పాటు చేయలేదని సర్పంచ్ కుమారస్వామి, ఎంపీడీవో మల్లేశం, ఎంపీవో కొమురయ్యను ప్రశ్నించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో కాలినడకన తిరిగారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే, గేట్‌వాల్వ్ వద్ద నీరు తాగి పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న మురుగు కాల్వలను చూసి అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరించాలని సర్పంచ్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీటీసీ కొనకటి రాణి-మొగిలి, ఉపసర్పంచ్ పెండ్లి శారద-కుమారస్వామి, కక్కెర్ల వీరస్వామి, టీఆర్ఎస్ నాయకులు ప్రతాప్, ప్రశాంత్, పురుషోత్తం, ప్రవీణ్ ఉన్నారు.