వర్ధన్నపేట/నర్సంపేటరూరల్/నల్లబెల్లి, జూన్ 15: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. పచ్చదనం, పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మ రం చేశారు. దీంతో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. వెరసి పల్లెలు ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా మారుతున్నారు. జిల్లాలో 13వ రోజు బుధవారం పల్లెప్రగతి పనులు వేగంగా జరిగాయి. వర్ధన్నపేట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని పిచ్చి మొక్కలను జడ్పీటీసీ మార్గం భిక్షపతితో కలిసి ఎంపీపీ అన్నమనేని అప్పారావు తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఏడీఏ సురేశ్‌కుమార్, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఏవో రాంనర్సయ్య పాల్గొన్నారు.
నర్సంపేట మండలం గురిజాలలో వినూత్న రీతిలో ఎస్ఈఆర్పీ, డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు, లీడర్లు, వీవో సభ్యులు శ్రమదానం చేశారు. ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, ఏపీఎం కుందేళ్ల మహేందర్ క్రీడా మైదానం కోసం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్ గొడిశాల మమత, కార్యదర్శి రాజమౌళి, వీవోఏలు సునీత, మమత, సభ్యులు పాల్గొన్నారు. ముత్యాలమ్మతండా, ఇటుకాలపల్లి, పాతముగ్దుంపురం, లక్నేపల్లి, ముగ్దుంపురం, దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేటలో పారిశుధ్య పనులు కొనసాగాయి. నల్లబెల్లి మండలం కొండాపూర్, శనిగరం, గోవిందాపూర్ను మండల ప్రత్యేక అధికారి జహీరొద్దిన్ సందర్శించి పనులను పరిశీలించారు. పచ్చదనం, పరిశుభ్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీవో కూచన ప్రకాశ్, గ్రామ ప్రత్యేక అధికారులు ఝాన్సీ, రవీందర్, సర్పంచ్‌లు డేగల మల్లికాంబ, కరివేదుల వెంకటరెడ్డి, గూబ తిరుపతమ్మబాబు, కార్యదర్శులు రజిత, శాంత, జ్యోతి ఉన్నారు.

‘పల్లెప్రగతి’పై నిర్లక్ష్యం వద్దు
ఖానాపురం/చెన్నారావుపేట/పర్వతగిరి/గీసుగొండ: పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం చేయొద్దని డీఎల్పీవో వెంకటేశ్వర్లు అన్నారు. బుధరావుపేటలో పల్లెప్రగతి పనులను ఆయన పరిశీలించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, స్పెషలాఫీసర్లు పాల్గొన్నారు. మండలంలో బుధవారం శ్రమదానాలు చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. చెన్నారావుపేట మండలం గొల్లపల్లె, పుల్లాయబోడుతండాలో రోడ్లను శుభ్రం చేశారు. గొల్లపల్లెలో ప్రత్యేక అధికారి కిశోర్ డంపింగ్ యార్డును పరిశీలించి వర్మీకంపోస్టు తయారీ తెలుసుకున్నారు. కార్యక్రమంలో గొల్లపల్లె సర్పంచ్ రమేశ్, కార్యదర్శి జ్యోతి, పుల్లాయబోడుతండా సర్పంచ్ సమ్మునాయక్, కార్యదర్శి శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే, గొల్లభామతండా వైకుంఠధామంలో బోరు పనులు ప్రారంభించారు.
ప్రత్యేక అధికారి బాలకృష్ణ, ఎంపీడీవో దయాకర్, ఖాదర్‌పేట సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ శ్రీను, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండలో సర్పంచ్ గటిక సుష్మా నేతృత్వంలో మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా వీధులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో మహేశ్, ఉపసర్పంచ్ దర్నోజు దేవేందర్, కార్యదర్శి సరిత, మహిళా సంఘాల సభ్యులు, సీఏలు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జీపీలో తడి, పొడి చెత్తపై సభ్యులకు అవగాహన కల్పించారు. గీసుగొండ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ భీమగాని సౌజన్య, ఎంపీడీవో రమేశ్ అధికారులతో కలిసి పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో ప్రభాకర్, ఏపీవో మోహన్‌రావు, సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు.