ములుగురూరల్, జూన్ 14 : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే పనులతో గ్రామాల రూపురేఖలు మారాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ములుగు మండలం మల్లంపల్లిలోని పల్లెప్రకృతి వనం, తెలంగాణ క్రీడా మైదానం, మన ఊరు-మన నర్సరీ, బృహత్ పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు పల్లెలను అభివృద్ధి చేయాలన్నారు. పరిసరాల శుభ్రతతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. వర్షాలకు మొక్కలు పడిపోకుండా సరిచేయాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనంలో మొకల మధ్య దూరం ఉండకుండా దగ్గర దగ్గరగా నాటాలని తెలిపారు.
బృహత్ పల్లె ప్రకృతి వనానికి పకన ఉన్న ప్రభుత్వ భూమిని అదనంగా కలుపుకొని మొక్కలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆరేపల్లి నుంచి గట్టమ్మ దేవాలయం వరకు ఫోర్ లైన్ రోడ్డు మంజూరైనందున రోడ్లపై వ్యాపారం జరుగకుండా మారెట్లోనే అమ్మకాలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి అక్కడే ఉన్న ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాలని, ఉత్తమ పంచాయతీలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, ములుగు ఎంపీడీవో ఇక్బాల్, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీటీసీ ప్రభాకర్, సర్పంచ్ చంద్రకుమార్, ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, సెక్రటరీ రాజు తదితరులు పాల్గొన్నారు.