హనుమకొండ/నయీంనగర్/వరంగల్/ఆత్మకూరు/పరకాల, జూన్ 14: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని సన్మానించారు. హనుమకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్‌లో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ కే అనితారెడ్డి రక్తదానం చేశారు. 20 ఏళ్లుగా ఏటా 3 సార్లు రక్తదానం చేస్తున్నట్లు చెప్పారు. అందరూ రక్తదానం చేయడానికి ముందుకురావాలని కోరారు. అలాగే, నిట్ వరంగల్‌లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, రెడ్‌క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణరావు, డీన్పీ రవికుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 150 మంది రక్తదానం చేశారు. అలాగే, వరంగల్ ఏవీవీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్యర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సేలందిస్తున్న వలంటీర్లతో పాటు 38 సార్లు రక్తదానం చేసిన ఏవీవీ కాలేజీ ఎన్ఎస్ఎస్ అధికారి కోడిమాల శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సంజీవరావు, అధ్యాపకులు, విద్యార్థులు జయ, శ్రీదేవి, శివాని, రమ్య, సనా, సాయి, ప్రమోద్, కార్తికేయ, గణేశ్ పాల్గొన్నారు. ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన దూడం భాస్కర్ 27 సార్లు రక్తదానం చేయగా ఆయనను ఎంజీఎం బ్లండ్ బ్యాంకులో ఆర్ఎంవో అప్పలాప్రసాద్, వరంగల్ డీఎంహెచ్‌వో వెంకటరమణ, వైద్యసిబ్బంది అభినందించారు. అలాగే, ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ డీ సంతోష్‌కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఓదేలు, అధ్యాపకులు ఎం అరుణ, ఎల్ ఇందిరాదేవి, నవీన్, రాజయ్య, అశోక్‌కుమార్, రవికుమార్, సుష్మిత, అనిల్‌కుమార్, సుభాషిణి, రమ్యశ్రీ, సంజయ్, స్వప్న, రాజు, సందీప్ పాల్గొన్నారు.